• October 22, 2021

నన్ను వాడుకున్నారు!.. సిరిపై షన్ను అసహనం

నన్ను వాడుకున్నారు!.. సిరిపై షన్ను అసహనం

    బిగ్ బాస్ షోలో ముందు నుంచీ కూడా సిరి, షన్నుల ప్రవర్తన, ఆడే తీరు, వారి విధానం చూసి అందరూ నవ్వుకుంటూనే ఉన్నారు. ఆ ఇద్దరూ బయటే సెట్ చేసుకుని లోపలికి వెళ్లారనే టాక్ వచ్చింది. ఇక ఈ ఇద్దరికీ తోడు అన్నట్టుగా జెస్సీ వచ్చాడు. సిరి, షన్ను, జెస్సీ తొట్టిగ్యాంగ్, త్రిమూర్తుల్లా మారిపోయారు. మోజ్ రూంలోను కూర్చుని ముగ్గురు ముచ్చట్లు పెట్టడం తప్పా చేసిందేమీ లేదు. అయితే ఈ ముగ్గురు కలిసి మిగతా కంటెస్టెంట్ల మీద బిచ్చింగ్ చేయడం తప్పా ఇంకేమీ చేయలేరు.

    తమ వరకు వస్తే గానీ ఆట ఎలా ఉంటుందో తెలియదు. అలా మొత్తానికి సీక్రెట్ టాస్క్ ద్వారా బిగ్ బాస్ ఈ ముగ్గురి మధ్య చిచ్చు పెట్టేశాడు. జెస్సీకి సీక్రెట్ టాస్క్ ఇవ్వడం, ఒకరి సాయాన్ని తీసుకోవచ్చు అని చెప్పడం, దానికి వెంటనే ఎగ్జైట్ అయి ఊపుకుంటూ వెళ్లి సిరికి అంతా చెప్పడం, సిరి వెళ్లి షన్నుని కన్విన్స్ చేసి, జీరో ఎగ్స్ ఉండేలా ఒప్పించింది. నన్ను నమ్ము.. అంతా తెలిస్తే నువ్ హ్యాపీగానే ఉంటావ్.. అని చెప్పి టాస్క్ ఆడనివ్వకుండా జీరో ఎగ్స్ చేసేసింది.

    తీరా అది సీక్రెట్ టాస్క్ అని తెలియడంతో షన్ను తెగ హర్ట్ అయ్యాడు. నన్ను వెదవని చేశారు.. నన్ను వాడుకున్నారు.. నేను కెప్టెన్‌గా అవ్వడం నీకు ఇష్టం లేదా? అంటే నాకంటే వాడే ఎక్కువా? అని సిరి మీద షన్ను అసహనం వ్యక్తం చేశాడు. నాకు ఆట ఆడటం రాదు.. ప్రతీ ఒక్కరితో మాటలు పడాల్సి వస్తోంది.. నా ఫ్రెండ్సే నేను వేస్ట్ అని ఫ్రూవ్ చేశారు.. నా దారిద్రం అదే అంటూ సిరిని అనరాని మాటలు అనేశాడు. ఇక ఆ కోపంతో షన్ను నిన్న అంతా కూడా మెతుకు కూడా ముట్టుకోలేదు. సిరి వెళ్లి తినిపిస్తుంటే కూడా వద్దని అసహ్యించుకున్నాడు.

    Leave a Reply