• October 21, 2021

Hari Teja: అది చూసి నాకు కోపం వచ్చింది : బిగ్ బాస్ హరితేజ

Hari Teja: అది చూసి నాకు కోపం వచ్చింది : బిగ్ బాస్ హరితేజ

    Hari Teja బిగ్ బాస్ ఇంట్లో హరితేజ చేసిన ఎంటర్టైన్మెంట్‌ను ఎవ్వరూ అంత ఈజీగా మరిచిపోలేరు. బిగ్ బాస్ షోకు ముందు హరితేజ సీరియల్స్‌లో నెగెటివ్ రోల్స్, విలన్ పాత్రలను పోషించి అందరినీ భయపెట్టేసింది. అయితే సినిమాల్లో మాత్రం కామెడీ పాత్రలతో మెప్పించింది. ఇక బిగ్ బాస్ ఇంట్లో అయితే తన టైమింగ్‌తో అందరినీ కట్టిపడేసింది. హరితేజ చెప్పిన హరికథలు మామూలుగా ఫేమస్ అవ్వలేదు. అలా తనలోని టాలెంట్‌లన్నీ కూడా బిగ్ బాస్ షో ద్వారా బయటకు వచ్చేశాయి.

    బిగ్ బాస్ తరువాత హరితేజ సినీ కెరీర్ మారిపోయింది. ఎన్నో రకాల పాత్రలు, ఎన్నెన్నో అవకాశాలు ఆమెను చుట్టుముట్టాయి. బుల్లితెర, వెండితెర, సోషల్ మీడియాలో హరితేజ క్రేజ్ చాలా పెరిగిపోయింది. ఆమె గొంతు, గాత్రానికి కూడా చాలా మంది అభిమానులున్నారు. ఆమె ఎప్పుడైనా లైవ్‌లోకి వస్తే.. అభిమానులు కచ్చితంగా పాటలు పాడమని ఒత్తిడి చేస్తారు. ఆమె కూడా అభిమానుల కోరికలను మన్నించి పాటలు పాడేస్తుంటుంది.

    అయితే తాజాగా హరితేజ ఇన్ స్టాగ్రాంలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెట్టింది. ఇందులో రకరకాల ప్రశ్నలు అడిగారు. చాలాహరితేజ మంది తన ఆరు నెలల పాప భూమి గురించి అడిగారు. ఎలా ఉంది? ఇప్పుడు ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు? అనే ప్రశ్నలను సంధించారు. ఇప్పటి వరకు మీ మీద వచ్చిన రూమర్ ఏంటి? నవ్వు తెప్పించినా లేదా అది ఆగ్రహాన్ని కలిగించిన రూమర్ ఏంటని ఓ నెటిజన్ అడిగాడు. దానికి హరితేజ తన స్టైల్లో కౌంటర్లు ఇచ్చింది. వికిపీడియాలో తన వయసును తప్పుగా చూపిస్తుందోని అది నాకు కోపాన్ని తెప్పించిందని హరితేజ చెప్పుకొచ్చింది.

    Leave a Reply