- November 13, 2021
Bigg Boss 5 Telugu : సన్నీని కడిగిపారేసింది.. షన్నుకి అండగా దీప్తి సునయన

బిగ్ బాస్ షోలో పదోవారం కెప్టెన్సీ టాస్క్ గందరగోళంగా మారింది. సిరి, షన్ను, సన్నీల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. అనవసరంగా సన్నీ నానా మాటలు వదిలేశాడు. యూట్యూబ్ వరకే అంటూ కించపరిచాడు.. రా రా ఏంట్రా అంటూ అమర్యాదగా ప్రవర్తించాడు.. ఆడదాన్ని అడ్డం పెట్టుకుని ఆడుతున్నావ్.. ఏం ఆటలు రా అంటూ మాటలు వదిలేశాడు సన్నీ. వాటిపై ఇప్పుడు దీప్తి సునయన వివరణ ఇచ్చింది. సన్నీని కడిగిపారేసింది.
‘అప్పడం అయిపోతావ్ అని అనడం ఏంటి? నువ్ ఒక్కడివే ది బెస్ట్ అనుకో తప్పు లేదు కానీ మిగతా అందరినీ ఎందుకు అట్ల చూస్తున్నారు.. చేతగాని ఆటలు ఆడుతున్నాడు ఏంటి? ఫిజికల్ అయి గట్టి గట్టిగా అరిస్తే గేమ్ ఆడినట్టా? ఫిజికల్ అవ్వడం కన్నా మైండ్‌తో ఆడటం కష్టం. షన్ను అందులో బాగా ఆడుతున్నాడు. నాకు షన్ను క్లోజ్ అనే విషయం పక్కన పెడితే.. బిగ్ బాస్ షోలో షన్ను నాకు ఇంకా నచ్చాడు.. ఎంతో మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేస్తున్నాడు. ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని గేమ్ ఆడుతున్నాడా? సపోర్ట్‌గా నిల్చుంటే.. అమ్మాయిల్ని అడ్డు పెట్టుకుని గేమ్ ఆడుతున్నాడు అని అనడం తప్పు. నీకు కాజల్, మానస్ చేస్తే అలానే ఫీలవుతున్నామా మేం.. ఏం ఆడుతున్నావ్ గేమ్ నువ్వు.. నువ్ ఎట్ల అంటే అట్ల ఉండాల ఏంది? నీలా ఇంకొకరు ఉండలేరు.. ఇంకొకరిలా నువ్ ఉండలేవు..
యూట్యూబ్ వరకే గుర్తు పెట్టుకో నా? ఈ స్టేజ్ వరకు వచ్చాడు అక్కడే కష్టపడి అని తెలిసి హ్యాపీ అని అనుకోవాలి. కానీ యూట్యూబ్ వరకే ఏంది? చాలా తప్పు సన్నీ గారు.. ఈ రోజు మీరు నాకు నచ్చలేదు.. చూడలేకపోయా.. రా అంటేనే పడలేకపోయారు మీరు.. మరి అన్ని మాటలు అంటే ఎలా?’ అని సన్నీని దీప్తి సునయన కడిగిపారేసింది. తప్పు అయితే నేర్చుకుంటరా భై అని ఎంత బాగా చెప్పావ్ షన్ను.. నీకు మరింత శక్తి రావాలి.. నిన్ను హగ్ చేసుకోవాలని ఉంది అంటూ షన్ను మీద ప్రేమను కురిపించింది దీప్తి సునయన.