- November 13, 2021
Guppedantha Manasu Episode 294 : అహంకారి, మూర్ఖురాలు.. వసుని దారుణంగా అవమానించిన రిషి

గుప్పెడంత మనసు సీరియల్‌లో శనివారం వసుకు దారుణమైన అవమానం జరుగుతుంది. పరీక్షలు దగ్గర పడుతున్నాయని, విద్యార్థుల్లో భయం పోగొట్టేందుకు ఆటలు ఆడిస్తారు. స్టాఫ్, స్టూడెంట్స్ టీంలుగా విడిపోయి ఆడతారు. ఇందులో రిషి, వసు పోటీ పడాల్సి వస్తుంది. కానీ చివర్లో రిషి డ్రాప్ అవుతాడు. వసుతో పోటి పడి గెలిచినా.. అది ఉచిత గెలుపు అవుతుంది. అలాంటిది నాకు వద్దు. వేరే ఎవ్వరినైనా నా స్థానంలో ఎంచుకోమ్మని వసుకు చెబుతాడు. అలా ఎపిసోడ్‌లో మలుపు తిరుగుతుంది.
పుష్ఫ , జగతి ఆటలో.. రిషి ఒక్క మాట చెప్పడం. మేడం ఓడిపోవద్దు అని అనడంతో.. జగతి తన సత్తాను చాటింది. కొడుకు ఇచ్చిన ధైర్యంతో పుష్పను ఓడిచింది. చివరక ఈ ఆటలో రిషి, వసు పోటీ పడాల్సి వస్తే.. రిషి వెనక్కి తగ్గుతాడు. తన స్థానంలో హారిక అనే ఓ అమ్మాయిని వసు ఎంచుకుంటుంది. హారికను వసు ఆల్మోస్ట్ ఓడించేసింది. కానీ రిషి మీద కాఫీ పడటంతో ఒక్కసారిగా తన మనసు అటు వైపు వెళ్తుంది. వసు ఓడిపోతుంది.
అలా వసు ఓడిపోవడంతో రిషి రెచ్చిపోయాడు. అనరాని మాటలు అనేశాడు. ఓడిపోయింది.. అంటూ పదే పదే అంటాడు. నేను ఓడిపోలేదు.. నేను మీ వైపు చూశాను.. డైవర్ట్ అయ్యాను అంటూ కారణాలు చెప్పింది వసు. షటప్ వసుధార.. అంటూ రిషి ఫైర్ అయ్యాడు. ఒక్క మార్కుతో ఫెయిల్ అయిన ఫెయిల్ అయినట్టే.. ఓటమికి, గెలుపుకు మధ్య ఒక్క క్షణమే ఉంటుంది.. దీన్నే నిర్లక్ష్యం, అతి, ఓవర్ కాన్ఫెడెన్స్ అంటారు అని అందరి ముందే వసు పరువుతీస్తాడు రిషి.
ఓడిన వాళ్లు చెప్పేవి సాకులవుతాయ్.. నీకు నువ్ పెద్ద ఆల్ రౌండర్ అని ఓవర్ కాన్ఫెడ్స్.. గాల్లో ఎగిరే విమానం కూడా నేలకు దిగాల్సిందే. కిందకి దిగి రా వసుధార అంటూ మరింతగా బాధపెడతాడు.. అందరూ వినండి.. తప్పులు చేయకండి.. ఓడిపోకండి.. వసుధారలా అంటూ ఇంకా ఇంకా అదే మాటతో బాధపెడుతుంటాడు. అలా రిషి రెచ్చిపోతోంటే.. మహేంద్ర, జగతిలు బాధపడుతుంటారు. మనసులో ఒకటి పెట్టుకుని ఇంకోటి అంటున్నాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు. చివరకు రిషి మీద వసుకున్న మంచి అభిప్రాయం కూడా పోయేలా ఉందని అనుకుంటాడు. మీరైనా చెప్పండి అని మహేంద్రను జగతి అంటుంది. నేను చెబితే వింటాడా? జగతి అని మహేంద్ర అంటాదడు..
అనుకువ క్రమశిక్షణ ఉంటనే విజయం వస్తుంది.. గర్వం,అహంకారంతో విర్రవీగితో రావు అని రిషి అంటాడు. నాకు గర్వం ఉందా? సర్ అని వసు బాధతో అనేస్తుంది అవును ఉంది. తెలివైన దాన్ని అని.. ఏం చేసిన చెల్లుతుందని గర్వం.. యూత్ ఐకాన్ అని గర్వం.. అని రిషి అంటాడు. ఇంత మంది ముందు నన్ను అవమానించాలని నిర్ణయించుకున్నారా?.. మీరేనా?. సర్ అని వసు బాధతో అనేస్తుంది. అవును నేనే అంటూ రిషి చెలరేగిపోతాడు…
ఇక చాలు రిషి అని మహేంద్ర మధ్యలోకి వస్తాడు.కానీ రిషి ఇంకా రెచ్చిపోతాడు. పాఠాలు నేర్పాలి. గుణ పాఠాలి చెప్పాలి.. నన్ను చెప్పనివ్వండి.. కాన్ఫిడెన్స్‌కు కేరాఫ్ అడ్రస్.. విజయానికి పర్మినెంట్ అడ్రస్ అని చెప్పింది.. అంటూ రిషి అనేస్తాడు. ఓహో శిరీష్‌తో మాట్లాడింది విన్నాడా.. వింటే ఇప్పుడు అనాలా?.. అని వసు తన మనసులో అనుకుంటుంది. అహంకారం విజయ శిఖరాల నుంచి కిందకు పడేస్తుంది.. ఓటమి రుచి తెలిస్తేనే.. విజయం రుచి తెలుస్తుంది. జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నావ్.. తప్పుగా ఆలోచిస్తున్నావ్ అని రిషి పరోక్షంగా పెళ్లి గురించి టాపిక్ తీస్తాడు.
నేనేం తప్పుగా ఆలోచించాను.. నిర్ణయం తీసుకున్నాను ఒక్కటి చెప్పండి.. అని వసు రివర్స్‌లో అడుగుతుంది.. ఇదే తగ్గించుకోవాలి అని రిషి అంటాడు.. డియర్ స్టూడెంట్స్ ఈ అహంకారి అయిన వసుధారను ఉదాహరణగా తీసుకోండి.. అహంకారాన్ని వీడితేనే విజయం తలుపుతడుతుంది.. అని మళ్లీ బాధపెడతాడు రిషి. ఇది నా ఓటమి కాదు.. నేను ఒప్పుకోను అని వసు అంటే.. దీన్నే మూర్ఖత్వం అంటారు.. అహంకారానికి మూర్ఖత్వం తోడైతే.. గాలికి వాన తోడైనట్టు.. అని రిషి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వసు తన మాటలు చెప్పాలని ప్రయత్నించినా.. వెంటపడినా రిషి వినడు.
ఇక ఇంటికి వెళ్లిన వసు.. రిషి మాటలను తలుచుకుంటూ బాధపడుతుంది.. ఓడిపోయినందుకు బాధపడటం లేదు.. రిషి సర్ అన్న మాటలకు బాధపడుతున్నాడు.. మరిచిపోయే మాటలు అన్నాడా.. రిషి సర్ ఏదో మనసులో పెట్టుకుని విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు అంటూ జగతి మేడంతో వసు అంటుంది. ఇంకా ఏమైనా మీక్కూడా కోపం వస్తుంది అని జగతి మీద కూడా వసు మాటలు వదులుతుంది. ఇక్కడ ఈ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే.. అక్కడ రిషి, మహేంద్ర మాట్లాడుకుంటారు. ఏది ఏమైనా.. నువ్ అన్ని మాటలు అనాల్సింది కాదు అని మహేంద్ర.. పాఠాలు, గుణ పాఠాలు అందరి ముందే చెప్పాలి అని రిషి అంటాడు.. ఓడిందని అన్నావా? ఇంకేమైనా మనసులో పెట్టుకుని అంటావా? అని మహేంద్ర అసలు విషయం లాగేందుకు ప్రయత్నిస్తాడు.
ఇక వచ్చే వారం ఆసక్తికరమైన సన్నివేశాలు జరిగేలా ఉన్నాయి. పీఏ, అసిస్టెంట్‌గా రాజీనామ చేసేందుకు వెళ్తుంది వసు. కానీ అంతలోపే వసుని తీసేసి వేరే వాళ్లను నియమిస్తాడు రిషి. దీంతో వసుకు ఇంకా కాలుతుంది. మొత్తానికి వసు రిషిల మధ్య రాను రాను దూరం పెరిగేలా ఉంది.