- November 13, 2021
కారులో బోర్ కొడుతోందని ఆ పనులు.. మిల్కీ బ్యూటీ తమన్నా రచ్చ

తమన్నా ప్రస్తుతం తెలుగులో ప్రాజెక్ట్‌లు చకచకా మొదలుపెడుతోంది. ఫ్లాపులు, హిట్లతో సంబంధం లేకుండా సీనియర్, జూనియర్ అని తేడా లేకుండా తమన్నా ఓకే చెప్పేస్తోంది. సీటీమార్ దారుణమైన రాడ్ సినిమాలో తమన్నా కనిపించింది. సంపత్ నంది సినిమాలు అంటే తమన్నా ఉండాల్సిందే. అది అందరికీ తెలిసిందే. అయితే సీటీమార్ సినిమా తమన్నాకు ఏ మాత్రం ఉపయోగపడలేదు. కాస్త ట్రాక్ మార్చి కొత్తగా ట్రై చేసింది తమన్నా.
అలా మాస్ట్రో సినిమాలో తమన్నా తన విలనిజాన్ని, క్రూరత్వాన్ని బయటపెట్టేసింది. దీంతో తమన్నా దెబ్బకు అందరూ భయపడిపోయారు. మొత్తానికి తమన్నాకు మాత్రం మంచి పేరు వచ్చింది. అలాంటి పాత్రలు, నటించే స్కోప్ ఉన్న కారెక్టర్లు ఎంచుకోవాలని ఫిక్స్ అయింది. అలాంటి తమన్నాకు మళ్లీ కమర్షియల్ చిత్రాలేవచ్చాయి. చిరంజీవి పక్కన రెండో సార్లు చాన్స్ కొట్టేసింది. చిరంజీవి మెహర్ రమేష్ కాంబినేషన్‌లో రాబోతోన్న భోళా శంకర్ చిత్రంలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది
మొన్న జరిగిన పూజా కార్యక్రమాల్లో తమన్నా కనిపించింది. ఈ చిత్రం పార్ట్ అయినందుకు సంతోషంగా ఉందని చెప్పింది. తన కెరీర్ ప్రారంభంలో మెహర్ రమేష్ గారితో పని చేయాలని ఎంతో అనుకున్నాను కానీ అప్పుడు కుదరలేదంటూ తమన్నా నాటి విషయాలను పంచుకుంది. మొత్తానికి తమన్నా అయితే మరోసారి చిరుతో కలిసి స్టెప్పులు వేస్తుందన్నమాట.
అయితే తాజాగా తమన్నా కారులో ఎక్కడికి వెళ్తోంది. బహుషా షూటింగ్ స్పాట్‌కు వెళ్తున్నట్టుంది. కారులో అలా వెళ్తుంటే బోర్‌గా ఫీలైందట. అందుకే ఫోన్‌లో ఓ కొత్త ఆటను చూసిందట. అందులో మునిగి తెగ టైం పాస్ అయిపోయిందట. కెమెరా ఆన్ చేసి ఉంచితే.. రకరకాల ఎడిటింగ్‌లు రావడం, మనకు ఏం సూట్ అవుతుంది.. మనం ఏంటి అనే విషయాలను చెబుతుంది, ఆ ఆటలో తమన్నా మునిగింది. నీకు సూట్ అయ్యే ప్రొఫెషన్ ఏంటో తెలుసా? అంటే ఆర్టిస్ట్ అని కరెక్ట్ సమాధానం చెప్పంది ఆ యాప్.