• December 12, 2021

Samantha : నువ్ నా లక్కీ చార్మ్.. సమంత కామెంట్స్ వైరల్

Samantha : నువ్ నా లక్కీ చార్మ్.. సమంత కామెంట్స్ వైరల్

    Samantha Ruth Prabhu సమంత వ్యవహారం ఎంతకీ అర్థం కాదు. పెంచుకునే కుక్కకు బర్త్ డే విషెస్ చెబుతుంది. బర్త్ డే సెలెబ్రేషన్స్ గ్రాండ్‌గా నిర్వహిస్తుంది. హీరోయిన్లకు విషెస్ చెబుతుంది. నిర్మాతలకూ విషెస్ చెబుతుంది. వేరే హీరోల సినిమాలకు కంగ్రాట్స్ చెబుతూ పోస్ట్‌లు వేస్తుంటుంది. కానీ మాజీ భర్త, ఎక్కువ సినిమాలు కలిసి నటించిన తోటి హీరో నాగ చైతన్యను మాత్రం పట్టించుకోవడం లేదు.

    నాగ చైతన్య బర్త్ డేకు సమంత విషెస్ చెప్పదు.. బంగార్రాజు సినిమా నుంచి పాటలు విడుదలైనా స్పందించదు. సమంత మనసులోని ఉద్దేశ్యం ఏంటో ఎవ్వరికీ అర్థం కాదు. ఇక జీవితంలో నాగ చైతన్యకు సంబంధించిన విషయాల మీద రియాక్ట్ కాకూడదని నిర్ణయించుకుందో ఏమో గానీ సమంత చర్యల పట్ల జనాలు మాత్రం ఆశ్చర్యపోతోన్నారు.

    తాజాగా సమంత తన నిర్మాతకు విషెస్ చెప్పింది. అందులో సమంతకు తన నిర్మాతతో ఉన్న సన్నిహిత సంబంధం అర్థమవుతోంది. మనం ఇంకా కలిసి ఎన్నో ఫోటోలు దిగాలి.. హ్యాపీ బర్త్ డే జగదీష్.. నువ్వంటే ప్రతీ ఒక్కరి ఫేవరేట్.. ఒక్క ఫోన్ చేస్తే వెంటనే స్పందిస్తావ్.. నువ్ నా లక్కీ చార్మ్.. నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను అని సమంత చెప్పుకొచ్చింది.

    సమంత ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీ కానుంది. యశోద సినిమా షూటింగ్ ప్రారంభమైంది. పుష్ప ఐటం సాంగ్ షూటింగ్ కూడా పూర్తయింది. ఇక హాలీవుడ్ మూవీ షూటింగ్‌ కోసం సమంత సిద్దమవుతున్నట్టు కనిపిస్తోంది. అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే సినిమాతో సామ్ హాలీవుడ్ ఎంట్రీ అదిరిపోనున్నట్టు తెలుస్తోంది.

    Leave a Reply