- December 12, 2021
Lakshya Collection : ‘అఖండ’ దెబ్బకు నలిగిన ‘లక్ష్య’.. రెండో రోజు మరీ దారుణం!
Gamanam Day 2 Collection అసలే అఖండ విజృంభిస్తోంది. అలాంటి సినిమాను ఢీ కొట్టాలంటే చిన్న వాళ్లు ఆనరు. సరే చిన్న హీరోలు, చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిన సందర్భాలెన్నో ఉన్నాయి. కానీ అఖండ లాంటి మాస్ జాతర మధ్యలో ఓ సినిమా వచ్చి నిలబడాలంటే కంటెంట్ ఉన్న హీరో అయినా ఉండాలి.. కంటెంట్ ఉన్న కథ అయినా పడాలి.
ఈ వారం విడుదలైన రెండు సినిమాల్లోనూ అవి మిస్ అయ్యాయి. గమనం, లక్ష్య చిత్రాలు అఖండ దరిదాపుల్లోకి కూడా రావడం లేదు. ఈ రెండు చిత్రాల్లో అయితే గమనం మరీ చెప్పుకోలేని స్థితిలో ఉంది. ఆ సినిమాకు వస్తున్న వసూళ్లు చూస్తే నవ్వుకోవాల్సిందేనట. ఇక లక్ష్య విషయంలోనూ అలాంటి పరిస్థితే నెలకొంది. కోటి రూపాయలు కలెక్ట్ చేయడం కూడా గగనంగా మారుతుందట.
మొదటి రోజు, రెండో రోజు అంటూ లక్ష్య వసూళ్లు చూస్తుంటే.. ఏ ఒక్క రోజు కోటి రూపాయలు దాటి కనిపించడం లేదు. మొదటి రోజు దగ్గరదగ్గరగా 80 నుంచి 90 లక్షలు రాబట్టినట్టు సమాచారాం. మొదటి రోజే అలా ఉంటే.. ఇక వీకెండ్ శనివారం నాడు ఎలా ఉండాలి? ఇంకా కలెక్షన్లు పుంజుకోవాలి. కానీ దానికి విరుద్దంగా పరిస్థితి కనిపిస్తోంది.ఎందుకంటే అక్కడ అఖండ మాస్ జరుగుతోంది.
అఖండ దెబ్బకు థియేటర్లన్నీ దద్దరిల్లిపోతోన్నాయి. అందుకే ఈ హడావిడిలో లక్ష్య సినిమాను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఆ ఎఫెక్ట్ కలెక్షన్ల మీద పడింది. రెండో రోజు లక్ష్య సినిమాకు మరీ దారుణంగా యాభై అరవై లక్షల మధ్య కలెక్షన్లు వచ్చేట్టు కనిపిస్తోంది. ఈ లెక్కన లక్ష్య ఇక కోలుకోదు. ఇది భారీగానే నష్టాలను తీసుకొచ్చేలా ఉంది. అఖండ ప్రవాహాంలో గమనం, లక్ష్య కొట్టుకుపోతోన్నాయని తెలుస్తోంది.
- Tags
- Akhanda Collection
- Gamanam 2nd Day Collection
- Gamanam Collection
- Gamanam Day 2 Collection
- Gamanam Day 2 Overseas Collection
- Gamanam Day 2 Wolrdwide Collection
- Gamanam Total 2 Days Collection
- Lakshya 2nd Day Collection
- Lakshya Collection
- Lakshya Day 2 Collection
- Lakshya Day 2 Overseas Collection
- Lakshya Day 2 Worldwide Collection
- Lakshya Total 2 Days Collection
- అఖండ
- అఖండ కలెక్షన్
- అఖండ కలెక్షన్లు
- అఖండ కలెక్షన్స్
- గమనం
- గమనం రెండో రోజు కలెక్షన్లు
- గమనం సెకండ్ డే కలెక్షన్
- గమనం సెకండ్ డే కలెక్షన్స్
- లక్ష్య
- లక్ష్య రెండో రోజు కలెక్షన్
- లక్ష్య సెకండ్ డే కలెక్షన్