• October 25, 2021

Bigg Boss 5 Telugu : ఈ వారం ఎవరికి మూడుతుందో?

Bigg Boss 5 Telugu : ఈ వారం ఎవరికి మూడుతుందో?

    Bigg Boss 5 Telugu  బిగ్ బాస్ ఇంట్లో ఎనిమిదో వారం ప్రారంభం కాబోతోంది. ఇక ఈ ఎనిమిదో వారంలో ఎవరు నామినేట్ అవుతారు.. ఎవరి ఎవరిని నామినేట్ చేస్తారు.. ఏ ఏ కారణాలతో నామినేట్ చేస్తారు? అనేది ఆసక్తికరంగా మారనుంది. పైగా అసలే ఇంట్లో ఇప్పుడు మనుషులు తక్కువయ్యారు. ఏడువారాలు గడిచాయి. ఏడుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. అందులో ఆరుగురు ఆడవాళ్లే. ఒక్క నటరాజ్ మాస్టర్ మాత్రమే మేల్ కంటెస్టెంట్ల నుంచి ఎలిమినేట్ అయ్యాడు.

    సరయు, ఉమాదేవీ, లహరి, శ్వేతా వర్మ, హమీద, ప్రియ ఇలా అందరూ ఆడవాళ్లే బయటకు వచ్చారు. అయితే ఈ ఎనిమిదో వారంలో మాత్రం మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకుంటే ఎనిమిదో వారంలో దాదాపు అందరూ మగ కంటెస్టెంట్లే నామినేట్ అయినట్టు కనిపిస్తోంది. ఒక్క సిరి మాత్రమే లేడీ కంటెస్టెంట్ల నుంచి నామినేషన్ల లిస్ట్‌లోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ వారం నామినేషన్ అయిన లిస్ట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

    లోబో, షన్ను, సిరి, రవి, శ్రీరామచంద్ర, మానస్‌లు ఈ ఎనిమిదో వారంలో నామినేట్ అయినట్టు సమాచారం. ఇదే గనుక నిజమైతే లోబోకు టాటా చెప్పాల్సింది. ఎందుకంటే అందులో మిగతా అందరూ కూడా ఎంతో స్ట్రాంగ్. సిరి, షన్నులు అయితే అస్సలు ఎలిమినేట్ కారు. శ్రీరామ్, మానస్‌లు మంచి క్రేజ్ దక్కించుకున్నారు. రవి ఎలాగూ బిగ్ బాస్ దత్త పుత్రుడే. ఇక మిగిలింది లోబోనే. సీక్రెట్ రూం ఎఫెక్ట్ వల్ల లోబోకు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.

    Leave a Reply