- October 24, 2021
Actress Shruthi: సీరియల్ నటి శ్రుతిని కించపరిచిన ఫైమా.. ఆ మాట అనడంతో అంతా షాక్

Actress Shruthi ఒక్కొక్కరికీ ఒక్కో టైం వస్తుంది. అలా టైం వచ్చే వరకు ఎదురు చూడాల్సి వస్తుంది. ఆ ఓపిక ఉంటేనే సినీ ఇండస్ట్రీలో ఉండగలుగుతారు. అలా ఎంతో మంది ఎన్నో ఏళ్లు కష్టపడితే ఫేమస్ అవుతుంటారు. కొందరు షార్ట్ టైంలోనే లైమ్ లైట్లోకి వస్తారు. మళ్లీ కనిపించకుండాపోతారు. కానీ ఇప్పుడు అందరి నోట ఒక్క పేరు వినిపిస్తోంది. అదే ఫైమా. చూడటానికి పెద్ద అందగత్తె కాదు. ఆకారం వికారంగా ఉన్నా కూడా అదే తన బలంగా మార్చుకుంది.
పటాస్ షో నుంచి ఫైమా తనది తాను గుర్తింపు తెచ్చుకునేందుకు చాలా కష్టపడుతూ వచ్చింది. కానీ గుంపులో గోవిందలానే తన పరిస్థితి ఉండేది.కానీ జబర్దస్త్ షోలోకి వచ్చాక మెల్లిమెల్లిగా ఎదిగింది. తన నటనను ఇంప్రూవ్ చేసుకుంది. ఏకంగా గెటప్ శ్రీను లాంటి వాడికే పోటీ ఇచ్చింది. గెటప్పుల్లో గెటప్ శ్రీను కంటే ఫైమాకు ఎక్కువ పేరు వస్తోంది ఈ మధ్య.
అలా ఫైమా దూకుడుకు అందరూ భయపడుతున్నారు. అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా అన్ని చోట్ల తన పంచ్‌లతో అందరినీ అల్లాడిస్తోంది. తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమో వచ్చింది. అందులో సీరియల్ నటి శ్రుతి (మొగలిరేకులు ఫేమ్ గోమతి) పాత్రను పోషించింది. అద్భుతమైన టాలెంట్ కావాలంటే ఫైమా దగ్గరికి వెళ్లండి.. ఈ మధ్య బాగా చేస్తోంది అని తన గురించి తాను చెప్పుకుంది ఫైమా.
అక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఆ తరువాతే అసలు కథ ఉంది. అతి కావాలంటేనే ఈ శ్రుతి దగ్గరకు రండి అని శ్రుతీ పాత్రను పోషించినఫైమా కౌంటర్ వేసింది. అంటే శ్రుతీ నటన అతిలా ఉంటుందని ఫైమా పరోక్షంగా కౌంటర్లు వేసేసింది. శ్రుతీ, అతి అని ప్రాస కోసమే వాడిందో నిజంగానే ఆమె అభిప్రాయం కూడా అదేనో అంతా ఫైమాకు తెలియాలి.