- October 13, 2023
నీతోనే నేను మూవీ రివ్యూ.. సందేశాత్మక చిత్రం

విద్య, ఉపాధ్యాయుల గొప్పదనం చెప్పే కథతో తీసిన చిత్రమే ‘నీతోనే నేను’. టీచర్‌గా పని చేసి తనకున్న అనుభవాలతోనే నిర్మాత ఎమ్.సుధాకర్ రెడ్డి ఈ మూవీని నిర్మించారు. శ్రీమామిడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మాతగా మారి అంజి రామ్ దర్శకత్వంలో ‘నీతోనే నేను’ సినిమాను రూపొందించారు. సినిమా బండి ఫేమ్ వికాష్ వశిష్ట, కుషిత కళ్లపు, మోక్ష కథానాయకులుగా ఈ చిత్రం అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
కథ:
రామ్ (వికాస్ వశిష్ట) ఓ ప్రభుత్వ పాఠశాలలో టీచర్. గవర్నమెంట్ టీచర్లు అంటే ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. కానీ ఈ రామ్ అలాంటి సాదాసీదా టీచర్ కాదు. స్కూల్లో పిల్లలు చక్కగా చదువుకుని అభివృద్ధిలోకి రావాలని, వారికి ఎలాగైనా మంచి చేయాలని తాపత్రయపడే తత్త్వం కలవాడు. ఇక అతడ్ని చూసి తనను చూసి కొందరు ఈర్ష్య పడితే మరికొందరు ఇష్టపడుతుంటారు. ఆ స్కూల్లోనే పీఈటీగా పని చేసే ఆయేషా (కుషిత కళ్లపు) రామ్‌ను చూసి ఇష్టపడుతుంది. తన ప్రేమను రామ్‌కు చెబుతుంది? ఆ తరువాత జరిగిన ఘటనలు ఏంటి? రామ్ జీవితంలోని సీత ఫ్లాష్ బ్యాక్ ఏంటి? సీతకు ఏం జరిగింది? చివరకు రామ్, ఆయేషాల కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? అనేది థియేటర్లో చూడాల్సిందే.
నటీనటులు
సినిమా బండితో మెప్పించిన వికాస్ వశిష్ట.. నీతోనే నేను చిత్రంలో ఆకట్టుకున్నాడు. ఓ వైపు గవర్నమెంట్ టీచర్‌గా, మరో వైపు భార్య కోసం పరితపించే పాత్రలో మెచ్యూర్డ్‌గా నటించాడు. కుషిత కళ్లపు తెరపై అందగా కనిపిస్తే.. ఎమోషనల్ పాత్రలో మోక్ష ఆకట్టుకుంది. కన్నింగ్ టీచర్ పాత్రలో ఆకెళ్ల నటన ఆకట్టుకుంది. ఇలా సినిమాలోని అన్ని పాత్రలు ఓ మోస్తరుగా మేరకు మెప్పిస్తాయి.
విశ్లేషణ:
ప్రభుత్వ పాఠశాల దుస్థితిని చూపించేలా ఈ చిత్రం ఉంది. గవర్నమెంట్ స్కూల్స్‌లో చదివే పిల్లలకు చాలా సరైన వసతులు ఉండవు. అలాంటి వాళ్లకు అన్ని సౌకర్యాలు కల్పిస్తే మట్టిలో మాణిక్యాలను వెలికి తీసినట్టు అవుతుంది. ప్రభుత్వ పాఠశాలు, విద్యకు ఉన్న గొప్పదనం గురించి దర్శకుడు అంజిరామ్ తెరకెక్కించిన తీరు బావుంది.
ఇలా ఓ వైపు సందేశాన్ని ఇస్తూనే.. మరో వైపు మెసేజ్‌తో పాటు మంచి లవ్ స్టోరీని మిక్స్ చేసి తెరకెక్కించారు. కథను స్కూల్ బ్యాక్ డ్రాప్లో తీసుకెళుతూ ఇంటర్వెల్ ముందు హీరో, హీరోయిన్ మధ్య ఇచ్చే ట్విస్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే ఫస్టాఫ్‌ను కాస్త సాగదీతగా చేసినట్లు ప్రేక్షకులకు అనిపిస్తుంది.
ద్వితీయార్దంలో వచ్చే ట్విస్టులను మరింత ఆసక్తికరంగా తెరకెక్కించారు. పాటలు అంతగా గుర్తుండకపోయినా ఆర్ఆర్ ఓకే అనిపిస్తుంది. విజువల్స్ బావున్నాయి. ఎడిటింగ్, ఆర్ట్ డిపార్ట్మెంట్ వంద శాతం న్యాయం చేశాయి. నిర్మాత సుధాకర్ రెడ్డి తన పరిధి మేరకు మంచి కమర్షియల్ అంశాలతో సినిమాను రూపొందించారు.
రేటింగ్ 2.75