• November 14, 2021

Uttej : ఉత్తేజ్ ఇంట్లో సంబరాలు.. ఘనంగా కూతురు సీమంతం వేడుకలు

Uttej : ఉత్తేజ్ ఇంట్లో సంబరాలు.. ఘనంగా కూతురు సీమంతం వేడుకలు

    Uttej  నటుడు ఉత్తేజ్ ఇంట్లో గత నెలలో తీవ్ర విషాదం నెలకొంది. ఉత్తేChetana Chetana ChrCజ్ భార్య పద్మావతి మరణించారు. అయితే ఆ విషాదంలో కుటుంబం మెల్లిమెల్లిగా బయటపడుతోన్నట్టు కనిపిస్తోంది. ఉత్తేజ్‌కు ఇద్దరు కూతుళ్లన్న సంగతి తెలిసిందే. పెద్ద కూతురు చేతన ప్రేమ, పెళ్లి సంగతులు అందరికీ తెలిసిందే. ఇక చిన్న కూతురు పాట ఉత్తేజ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.

    సినిమాల్లో పాటలు కవర్ సాంగ్స్ చేస్తుంది.. డ్యాన్సుల్లో ఇరగ్గొట్టేస్తుంది.. తండ్రిలా కవిత్వం రాస్తుంది.. డైలాగ్స్ అదరగొడుతుంది. అలా పాట ఉత్తేజ్ సోషల్ మీడియాలో తన టాలెంట్‌ను చూపిస్తుంటుంది. అయితే తాజాగా పాట.. తన ఇంట్లో జరుగుతున్న వేడుకలకు సంబంధించిన విశేషాలను షేర్ చేసింది. తన అక్క సీమంతం గురించి పాట ఉత్తేజ్ తెలిపింది. ఇంట్లో జరుగుతున్న సంబరాలను వీడియోలు తీసి షేర్ చేసింది.

    పాట ఉత్తేజ్ నేటి శ్రీదేవీ డ్రామా కంపెనీ చిల్డ్రెన్స్ డే స్పెషల్ షోలో కనిపించింది. పాటలు పాడి అలరించింది. ఇక ఇప్పుడ ఇంట్లో అక్క సీమంతం వేడుకల్లో సందడి చేసింది. చేతన సీమంతం వేడుకల్లో సింగర్లు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తన అమ్మ మళ్లీ పుడుతుందని పాట ఉత్తేజ్ రాసిన ఎమోషనల్ నోట్ ఆ మధ్య ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.

    Leave a Reply