• November 14, 2021

Rashmi: మిమ్మల్ని అడుకుంటున్నాను.. దయచేసి అలా చేయకండి : యాంకర్ రష్మీ

Rashmi: మిమ్మల్ని అడుకుంటున్నాను.. దయచేసి అలా చేయకండి : యాంకర్ రష్మీ

    Rashmi యాంకర్ రష్మీ తన జీవితం కంటే ఎక్కువగా మూగ ప్రాణుల గురించే ఆలోచిస్తుంది. తన ప్రాణం కంటే ఎక్కువగా వాటి కోసమే తాపత్రయ పడుతుంది. అలాంటి రష్మీ తాజాగా ఓ వీడియోను చూసి తెగ బాధపడింది. అందరినీ వేడుకుంది. వీధి కుక్కలను హింసించినా, వాటిని ఎవరైనా బాధపెట్టినా కూడా రష్మీ తట్టుకోలేదు. వీధి కుక్కల కోసం గత లాక్డౌన్‌లో రష్మీ రోడ్డు మీదకు వచ్చిన సంగతి తెలిసిందే. స్ట్రీట్ డాగ్స్ కోసం ఫుడ్ సర్వ్ చేస్తూ రోడ్డు రష్మీ తన మానవత్వాన్ని చూపించింది.

    కుక్కలు ఎంత విశ్వాసంగా ఉంటాయో చూపించే ఎన్నో వీడియోలను షేర్ చేస్తుంటుంది రష్మీ. ఇక రష్మీ తన కంట పడ్డ పెట్స్‌ను జాగ్రత్తగా పెంచుతుంది. ఏదైనా ఇబ్బందుల్లో ఉందని తెలిస్తే కాపాడుతుంది. మేలు రకం జాతి కుక్కలు అంటూ షాపుల్లో కుక్కలను కొనకండి.. కావాలంటే ఎక్కడి నుంచైనా దత్తత తెచ్చుకోండని అందరినీ వేడుకుంటూ ఉంటుంది. తాజాగా రష్మీ చేసిన కామెంట్లు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.

    తాజాగా ఓ కుక్కకు కొంత మంది చిప్స్ లాంటి పదార్థాలను పెట్టారు. అయితే మానవత్వంతోనే పెట్టి ఉంటారు. కానీ రష్మీ మాత్రం ఇలాంటి పనులు చేయకండని వేడుకుంది. వాటికి ఉప్పుతో కూడుకున్న పదార్థాలను పెడితే విషపూరితమవుతుందని రష్మీ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో రష్మీ చేసిన కామెంట్లు అందరినీ కదిలిస్తున్నాయి.

    ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.. కుక్కలకు చిప్స్‌ను పెట్టకండి.. మిమ్మల్ని అడుక్కుంటున్నాను.. దయచేసి అలాంటి పెట్టకండి.. మీకు అంతగా పెట్టాలనిపిస్తే.. మిల్క్, పెరుగన్నం పెట్టండి.. చిప్స్‌లాంటివి పెడితే అవి త్వరగా చచ్చిపోతాయి.. వాటికి ఉప్పు అనేది విషంగా మారుతుంది అని తెలిపింది.

    Leave a Reply