- November 4, 2021
Samantha: పండుగ రోజు కూడా అంతే.. సమంతతో అంత ఈజీ కాదు!

Samantha సమంతతో నిజంగానే అంత వీజీ కాదు. ఆమె సంకల్పం, డెడికేషన్ వేరే లెవెల్‌లో ఉంటాయి. మామూలుగా పండుగ వస్తే ఎవ్వరికైనా సరే కాస్త రెస్ట్ తీసుకోవాలని అనుకుంటుంది. కచ్చితంగా విరామం తీసుకుంటారు. కానీ సమంత మాత్రం అలాంటిదేమీ చేయలేదు. దీపావళి పండుగ కదా? అని చూడలేదు. తన పని తాను చేసుకుంటూ పోయింది.
రెగ్యులర్‌గా ఎలా వర్కవుట్లు చేస్తారో అలానే చేసుకుంటూవెళ్లిపోయింది. తన స్నేహితురాలు, ఫిట్నెస్ ట్రైనర్, డాక్టర్ స్నేహా ఆధ్వర్యంలో సమంత వర్కవుట్లు చేసింది. ఆమె వీడియో కాల్‌లో సూచిస్తుంటే సమంత అలా వర్కవుట్లు చేసుకుంటూ వెళ్లిపోయింది. అంతే కాకుండా దీపావళి అనే దానికి కొత్త అబ్రివేషన్ కూడా ఇచ్చేసింది సమంత. తాజాగా ఆ వర్కవుట్లు, వీడియోలు, సమంత కామెంట్లు అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి.
దీపావళి రోజును కూడా రెస్ట్ ఇవ్వని సమంత.. వీడియో వైరల్@Samanthaprabhu2 #Samantha #SamanthaRuthPrabhu #SamWorkout #Diwali pic.twitter.com/hgocPZRKhH
— A2Z ADDA (@a2zaddaofficial) November 4, 2021
D అంటే డెడ్లీఫిట్.. I అంటే ఇంచ్ వార్మ్ పుష్ అప్స్.. W అంటే వాల్ బాల్స్.. A అంటే ఆల్టర్నేటింగ్ స్టార్ క్రంచెస్ L అంటే లంగ్ ప్రెస్ I ఐస్ స్టేకర్స్ అంటూ సమంత చెప్పేసింది. మొత్తానికి సమంత చేసిన వర్కవుట్లు మాత్రం ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక తన స్నేహితురాలు స్నేహా, సమంత పెట్టిన ముచ్చట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.