- November 4, 2021
Intinti Gruhalakshmi Episode 468 : సంపాదించడం చేత కాదట.. ప్రేమ్ పరువుతీసిన అంకిత

Intinti Gruhalakshmi Episode 468 ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్‌లో ఇప్పుడు రెండు కోట్ల పెనాల్టీ చుట్టూ కథ తిరుగుతోంది. వాటిని చెల్లించేందుకు, ప్రాజెక్ట్ పని పూర్తి చేసేందుకు నందు తరుపున తులసి కష్టపడుతోంది. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో నందును రెచ్చగొట్టింది తులసి. తన భర్తను తన దారిలోకి తెచ్చుకుంది. ఆఫీస్‌కు వచ్చి పని చేస్తాను..ప్రాజెక్ట్ పూర్తి చేస్తాను అని నందు నోటే చెప్పించింది తులసి. అలా తులసి సక్సెస్ అవ్వడంతో లాస్యకు కడుపు మండింది.
ఎందుకలా? చేశావ్.. ఇన్ని రోజులు నీకు బుద్ది ఉందని అనుకున్నాను కానీ లేదు అని నందు మీద అరిచింది లాస్య. తులసి మీద రివేంజ్ తీసుకునేందుకు ఒప్పుకున్నాను అని, ఒకప్పుడు తన పనిని చులకనగా చూసింది.. ఆఫీస్ పని కంటే ఇంటి పనే కష్టమన్నట్టుగా మాట్లాడింది.. ఇప్పుడు తులసికి గుణపాఠం చెబుతాను.. పగతీర్చుకుంటాను అని నందు అన్నాడు. తులసి ఆటలో అరటి పండులానే అవుతుందని లాస్యకు భరోసా ఇచ్చాడు నందు.
ఆఫీస్‌లో జీతాలు ముందుగానే ఇస్తాను అని చెప్పిన తులసికి ఎదురుదెబ్బ తగిలేట్టు కనిపించింది. ఎందుకంటే ఆఫీస్ అకౌంట్లో ఐదు లక్షలు ఉంటాయని అనుకుంది తులసి. కానీ మిషన్ కోసం రెండున్నర లక్షలు ఖర్చు అయిపోయాయి. ఇక ఎంప్లాయిస్ జీతాలు ఎలా చెల్లించాలని తులసి మథన పడుతుంది. ఆ విషయాన్ని తెలసుకున్న శ్రుతీ.. తన అమ్మకు గుర్తుగా ఉన్న నెక్లెస్‌ను అమ్మి డబ్బు తీసుకురమ్మని ప్రేమ్‌కు చెబుతుంది.
ఈ విషయాన్ని తెలుసుకున్న అంకిత మాస్టర్ ప్లాన్ వేసింది. అత్తయ్య గారికి సాయం చేయాలి.. మా డబ్బులు ఇస్తాను అంది.. వెళ్లి తీసుకురా అని అభిని పంపుతుంది అంకిత. అలా మొత్తానికి శ్రుతీ ఎంతో ప్రేమతో అలా డబ్బును సమకూర్చితే.. అంకిత వచ్చి నాశనం చేస్తుంది. వాళ్ల అమ్మ గుర్తుగా ఉన్న నెక్లెస్ అమ్మి ఇచ్చింది.. ప్రేమ్ కూడా సంపాదించడం లేదు కదా?.. ఏవో పాటలు అంటూ తిరుగుతాడు.. మంచి ఉద్యోగం కూడా లేదు కదా? అంటూ అంకిత అనరాని మాటలు అనేసింది.
ఆ మాటలకు ప్రేమ్ ఫీలయ్యాడు. మొత్తానికి తన అమ్మను అడిగి తీసుకొచ్చిన రెండున్నర లక్షల రూపాయాలను తులసికి ఇచ్చేసింది అంకిత. శ్రుతీ, ప్రేమ్‌లను అనుుకన్నట్టుగానే అవమానించేసింది. అలా అంకిత తన ప్లాన్‌లో సక్సెస్ అయింది.