- December 5, 2021
Samantha : ఏం జరిగినా సరే అంగీకరించాల్సిందేనట!.. సమంత అందుకే వదిలేసిందా?
Samantha Ruth Prabhu సమంత ఇప్పుడు మంచి ఫాంలో ఉంది. పర్సనల్ లైఫ్‌ను పూర్తిగా పక్కన పెట్టేసింది. ప్రేమ, పెళ్లి, విడాకులు జీవితంలో సహజం అని అనుకుందే ఏమో గానీ సమంత మాత్రం ఇప్పుడు పర్సనల్ కెరీర్‌ను అంతగా పట్టించుకోవడం లేదు. మళ్లీ పెళ్లి అనే ఆలోచన అస్సలు లేనట్టు కనిపిస్తోంది. అదంతా పక్కన పెడితే అసలు ఇప్పుడు సమంత సినీ కెరీర్ మాంచి పీక్స్‌లో ఉంది.
ఆల్రెడీ రెండు సినిమాలను పట్టేసింది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఆ రెండు ద్విభాష చిత్రాలే కాకుండా ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్‌ను కూడా పట్టేసింది. ఇలా మొత్తానికి సమంత సినిమాల పరంగా దూసుకుపోతోంది. అయితే సమంత ఇప్పుడు కొత్త స్టెప్ వేసింది. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేసింది. ఇది కూడా ఓ హాట్ టాపిక్ అయింది.
సమంత ఏంటి? ఐటం సాంగ్ చేయడమేంటి? అని అంతా అనుకున్నారు. కానీ సమంత మాత్రం అన్ని రకాలుగా ట్రై చేయాలని ఫిక్స్ అయినట్టుంది. అందుకే భారీ మొత్తాన్ని డిమాండ్ చేసి ఆ స్పెషల్ సాంగ్‌లో నర్తించేసిందట. అయితే ఇప్పుడు తాజాగా సమంత ఓ కొటేషన్‌ను షేర్ చేసింది. అందులోని వ్యాఖ్యలు సమంత చేసినట్టుగానే అనుకోవాలా? అనే అనుమానం కలిగించేస్తోంది.

జీవితంలో జరిగే ఎన్నో విషయాల్లో పర్వాలేదనిపిస్తుంది.. కానీ అన్నీ సవ్యంగానే జరగవు. కొన్ని సందర్భాల్లో మనం ఎంతో కష్టపడతాం.. కానీ వాటిని మనం కోల్పోతాం. సరైన ఫలితం రాకపోవచ్చు. కానీ కొన్ని సార్లు మనం ఎంతో గట్టిగా పట్టుకోవాలని ప్రయత్నిస్తాం.. కానీ అక్కడ చాయిస్ ఉండదు.. వదిలి వెళ్లనివ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అది మనం అంగీకరించి అక్కడి నుంచి బయటకు వచ్చేయాల్సిందంతే అని సమంత ఓ కొటేషన్‌ను షేర్ చేసింది.
- Tags
- Naga Chaitanya
- Samantha
- Samantha Divorce
- samantha ruth prabhu
- Samantha Ruth Prabhu Age
- Samantha Ruth Prabhu Divorce
- Samantha Ruth Prabhu Husaband
- Samantha Ruth Prabhu Movies
- Samantha Ruth Prabhu News
- Samantha Ruth Prabhu Twitter
- నాగ చైతన్య
- సమంత
- సమంత ఫోటోలు
- సమంత ఫోన్ నెంబర్
- సమంత విడాకులు
- సమంత వీడియో
- సమంత సినిమాలు