- October 27, 2021
Samantha: పెళ్లి గురించి అంతగా ఆలోచించకండి.. సమంత పోస్ట్ వైరల్

Samantha సమంత ఇప్పుడు స్వేచ్చాయుత పక్షిలా, పంజరంలోంచి బయటకు వచ్చిన పక్షిలా స్వేచ్చగా విహరిస్తోంది. నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత ఫుల్ హ్యాపీగా ఉంటోంది. స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకుంటోంది. మొన్నటి వరకు సమంత తీర్థయాత్రలతో బిజీగా గడిపింది. ఒక్కసారైనా సరే ఛార్ ధాయ్ యాత్ర చేయాలని అంతా అనుకుంటారు. అలా సమంత తన ఛార్ ధామ్ యాత్రను ముగించుకుంది. అక్కడి విశేషాలను పంచుకుంది. తాను ఎంతో సంతోషంగా ఉన్నాననే విషయాన్ని చెప్పకనే చెప్పేసింది.
ఛార్ ధామ్ యాత్రలో సమంత ఎన్నో విషయాలను నేర్చుకుంది. ఎన్నెన్నో అద్భుతాలను,రహస్యాల గురించి తెలుసుకుంది. ఇక శిల్పారెడ్డి ప్రతీ ఒక్క విషయాన్ని వివరిస్తూ ఉంటే సమంత దాన్ని తిలకించినట్టు కనిపించింది. గంగా, యమున పుట్టుకలు, భగీరథ ప్రయత్నం గురించి అన్నీ వివరించింది. అలా సమంత తన తీర్థయాత్రను ఎంతో ఎంజాయ్ చేసింది. అయితే తాజాగా రానీ రాంపాల్ షేర్ చేసిన ఓ పోస్ట్‌కు సమంత రియాక్ట్ అయింది.
మామూలుగా అయితే ఇండియాలో అమ్మాయిల పెళ్లి కోసం తల్లిదండ్రులు ఎంతో ఆలోచిస్తారు. పుట్టినప్పటి నుంచే పెళ్లి కోసం డబ్బులు దాచి పెడుతూ ఉంటారు. అయితే వాటిపై రాంపాల్ స్పందించారు. మీ అమ్మాయిని సమర్థవంతగా శక్తివంతమయ్యేలా పెంచండి.. ఆమె పెళ్లి కోసం మీరు బాధపడకండి.. ఎవరి సాయం లేకుండా పెరిగేంత ధైర్యాన్ని ఇవ్వండి. పెళ్లి కోసం కాదు.. ఆమె చదువు కోసం డబ్బులు ఖర్చుపెట్టండి. ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకోవడం నేర్పండి. సొంత కాళ్ల మీద నిలబడే దైర్యాన్ని ఇవ్వండి అని చెప్పుకొచ్చారు. దానికి సమంత కూడా అవును నిజం అన్నట్టుగా స్పందించింది.