• October 27, 2021

మోసం చేసిన బాలీవుడ్ బ్యూటీ.. ఊర్వశి రౌటెలా వీడియో వైరల్

మోసం చేసిన బాలీవుడ్ బ్యూటీ.. ఊర్వశి రౌటెలా వీడియో వైరల్

    బాలీవుడ్ బోల్డ్ బ్యూటీల్లో ఊర్వశి రౌటెలా ముందుంటుంది. ఈ మధ్య కాలంలో ఊర్వశీ అందాలకు అందరూ ఫిదా అయ్యారు. వెండితెరపై అందాలను ఆరబోయడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గని ఈ బ్యూటీ తక్కువ సమయంలోనే ఎక్కువగా ఫేమస్ అయింది. అలాంటి ఊర్వశికి నెట్టింట్లో ఫుల్ ఫాలోయింగ్ ఏర్పడింది. గ్రేట్ గ్రాండ్ మస్తీ సినిమాలో విచ్చలవిడిగా అందాలను ఆరబోసి, బికినీలో కనువిందు చేసి బాలీవుడ్ జనాలను ఆకట్టుకుంది. అంతే కాకుండా ప్రైవేట్ ఆల్బమ్‌లతోనూ దుమ్ములేపేసింది.

    అయితే ఆ మధ్య తెలుగు ప్రాజెక్ట్‌ ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.సంపత్ నంది నిర్మిస్తోన్న బ్లాక్ రోజ్‌తో ఊర్వశీ నేరుగా తెలుగుచిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. గడిచిన లాక్డౌన్‌లో ఈ సినిమాప్రమోషన్స్ బాగా చేశారు. ఓ స్పెషల్ పోస్టర్లు, టీజర్లు, సాంగ్ షూట్‌కు సంబంధించిన అప్డేట్లు కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ సినిమా గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదు. అసలు సినిమా ఉందో లేదో కూడా తెలియడం లేదు.

    అప్పుడు హైద్రాబాద్‌కు వచ్చిన ఊర్వశీతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అంటూ మొక్కలు కూడా నాటించారు. ఆ బ్యూటీ ఇప్పుడు ఇన్ స్టాగ్రాంలో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో తాను ఏదో మ్యాజిక్ చేస్తున్నట్టుగా చూపించింది. దోసకాయను గాల్లో నిల్చోబెట్టినట్టు బిల్డప్ ఇచ్చింది. కానీ తీరా చూస్తే దానికి ఓ స్పూన్‌ను గుచ్చింది. ఆ స్పూన్‌ను నోట్లో పెట్టుకుంది. అలా ఆ దోసకాయను గాల్లో నిలబెట్టేశాను అని చెబుతూ మోసం చేసేసింది. మొత్తానికి అమ్మడు తెలివితేటలకు అంతా ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

    Leave a Reply