- November 20, 2021
ఎంతో సంతోషంగా ఉంది!.. సమంత కామెంట్స్ వైరల్

సమంతకు ఇంతటి స్టార్డం రావడానికి చిన్మయి కూడా ఓ కారణమే. కనిపించేది సమంతే అయినా కూడా వినిపించేది మాత్రం చిన్మయి. ఏ మాయ చేశావే సినిమా నుంచి సమంతకు చిన్మయి డబ్బింగ్ చెబుతూనే ఉంది. అసలు సమంత ఇంతలా క్రేజ్ తెచ్చుకోవడానికి కారణమే ఆ హస్కీ వాయిస్. అలా సమంత, చిన్మయి రిలేషన్ కొన్నేళ్ల నుంచి కొనసాగుతూనే వచ్చింది. చిన్మయి లేకపోతే సమంత లేదనే చెప్పొచ్చు. అలా సమంత కెరీర్‌లో చిన్మయి ఎంతో ముఖ్య పాత్రను పోషించింది.
ప్రొఫెషనల్‌గా కాకుండా ఫ్యామిలీ పరంగానే ఎంతో సన్నిహితంగా మారారు. చిన్మయికి అన్ని వేళలా సమంత అండగా ఉంటుంది. సమంతకు కూడా చిన్మయి మోరల్ సపోర్ట్ ఇస్తుంటుంది. తాజాగా సమంత తన స్నేహితురాలి కోసం సాయం చేసింది. చిన్మయి కొత్త బిజినెస్ ప్రారంభించింది. స్పా సెంటర్, బ్యూటీ సెంటర్‌వంటి దాన్ని ఓపెన్ చేసింది చిన్మయి. ఆ బిజినెస్‌ను సమంత చేతులు మీదుగా ప్రారంభించారు. చిన్మయి వేసిన ఈ కొత్త అడుగుల పట్ల సమంత సంతోషాన్ని వ్యక్తం చేసింది.
ఇన్ని రోజులుగా చిన్మయి ఎన్నో బ్యూటీ టిప్స్ చెబుతూ వచ్చింది. స్కిన్ కేర్ గురించి ఎన్నో పోస్ట్‌లు చేసింది. ఇక ఇప్పుడు ఏకంగా Deep Skin Dialogues అంటూ కొత్త స్టోర్‌ను ఓపెన్ చేసింది. ఇలా వ్యాపారాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది చిన్మయి. నీకు వీటిపై ఉన్న ప్యాషన్ నాకు తెలుసు. ఇది చాలా సక్సెస్ అవుతుందన్న నమ్మకం నాకుంది. చెన్నైలో మెడి స్పా.. సౌత్ ఏసియాలోనే ఇదే మొదటి హాలీవుడ్ స్కల్పింట్ సెంటర్ అని సమంత ఆ స్పా సెంటర్ విశేషాలను తెలిపింది.