• November 20, 2021

Guppedantha Manasu Episode 300 : రిషి ఆలోచనల్లో మునిగిన వసు.. ఆ కలయిక భ్రమే.. అదిరిపోయిన సీన్

Guppedantha Manasu Episode 300 : రిషి ఆలోచనల్లో మునిగిన వసు.. ఆ కలయిక భ్రమే.. అదిరిపోయిన సీన్

    గుప్పెడంత మనసు సీరియల్‌లో శనివారం మంచి ఎపిసోడ్ మిస్ అయిపోయాం. ఇక వసు రిషి కలిసి పోతారు.. హగ్ చేసుకున్నారు.. తన మనసులోని మాటలను వసు బయటకు చెప్పేసిందన్నట్టుగా ప్రోమో వదలుతూనే వచ్చారు. అయితే సీరియళ్లను ఎక్కువగా ఫాలో అయ్యే వారికి అది అంతా భ్రమే ఎవరో ఒకరు కలగని ఉంటారు అని ఇట్టే తెలిసిపోతుంది. మనం అలానే రాశాం. చివరకు మనం చెప్పుకున్నట్టే జరిగింది. అది నిజం కాదు. ఆ కలయిక వసు భ్రమల్లోంచి వచ్చింది. అయితే ఆ ఇద్దరి మధ్య దూరం దూరంగా పోయి.. దగ్గర మరింత దగ్గరైనట్టు కనిపిస్తోంది. శనివారం నాటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఓసారి చూద్దాం.

    రిషి ఆలోచనల్లోవసు ఉంటుంది. అలా ఎలా అనుకుంటాడు.. అడిగితె చెప్పేదాన్ని కదా? చెబితే వినరు.. చెప్పనివ్వరు.. చీటికి మాటికి తిడతారు. ఇంకా ఫోన్ కూడా చేయలేదు. మీరు చేయరు.. మీరు ప్రిన్స్ కదా?. ఈ సారి కలిసినప్పుడు అన్నీ అడిగేస్తాను.. పేపర్ మీద రాసి పెట్టుకుంటాను.. అన్నీ అడిగేస్తాను. నేను చెప్పేది వినడు.. సర్ ఏదీ చెప్పడు.. పూర్తిగా చెప్పడు.. శిరీష్ వస్తే మాట్లాడాడు.. నన్ను చూస్తే మొహం తిప్పేసుకుంటాడు.. ఈ సారి నేను గంట సేపు మాట్లాడతాను అని వసు అనుకుంటూ ఉంటుంది.

    ఇంతలో రిషియే ఫోన్ చేస్తుంటాడు. ఏంటి రిషి సర్ ఫోన్ చేస్తున్నాడు.. అమ్మో ఇప్పుడు మాట్లాడితే తప్పు నాదే.. సారీ అని ఒక్క మాటలో తేల్చేస్తాడు.. వద్దు కట్ చేస్తాను.. అని కట్ చేస్తుంది వసు. పొగరు ఎందుకు కట్ చేసింది.. ఫోన్ చేస్తే మాట్లాడాలి కదా? అని రిషి మళ్లీ ఫోన్ చేస్తాడు. ఎందుకు ఇలా పదే పదే చేస్తున్నారు.. ఒక్కసారి కట్ చేస్తే అర్థం చేసుకోవాలి కదా?.. ఇక్కడ కూడా తనదే పై చేయి అవ్వాలని చూస్తున్నట్టున్నాడు అని వసు చివరకు ఫోన్ లిఫ్ట్ చేస్తుంది.

    ఎలా ఉన్నావు.. అని రిషి అంటే.. అలానే ఉన్నాను సర్ అని వసు బధులిస్తుంది.. చాలా మాట్లాడాలి.. చాలా అడగాలి సర్ అని వసు అంటుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంది.. ఒక్క నిమిషం సర్ అని డోర్ తీయడంతో వసు షాక్ అవుతుంది. చూస్తే రిషి వచ్చి ఉంటాడు. సర్ మీరు.. అని కంగారు పడ్డ వసు లోపలకి రమ్మంటుంది. వచ్చే దారిలో స్లిప్ అవుతుండటంతో వసుని రిషి పట్టుకుంటాడు.. లోపలకు వచ్చిన తరువాత సోఫాలో కూర్చుంటారు. ఎదురెదురుగా ఉన్నా కూడా ఏం మాట్లాడుకోరు.

    వసు మాటలను రిషి.. రిషి మాటలను వసు గుర్తుకు చేసుకుంటూ ఉంటారు. ఏదైనా మాట్లాడొచ్చు కదా? అని తన మనసులో అనుకుంటాడు రిషి. ఇక్కడి దాకా వచ్చారు.. మాట్లాడొచ్చు కదా? నేనే ముందు మాట్లాడాలని చూస్తున్నారా? అని వసు తన మనసులో అనుకుంటుంది. నేనే ముందు మాట్లాడాలని చూస్తోందా? అని రిషి అనుకుంటాడు. అలా ఇద్దరూ ఒకేసారి నేను అని అంటారు. ఆగిపోతారు.. చెప్పండి సర్, చెప్పు అని మళ్లీ ఇద్దరూ ఒకేసారి అంటారు. అలా సీన్ అదిరిపోయింది.

    ఆ తరువాత లేచి నిల్చున్న వసు.. తన మనసులోని మాట చెబుతుంది. సర్.. కోపం వస్తే తిట్టండి.. కోపం తగ్గకపోతే మెసెజ్ పెట్టి తిట్టండి.. అంతే గానీ నాతో మాట్లాడకుండా ఉండకండి.. సర్.. నన్ను దూరం పెట్టకండి సర్.. నన్ను అపార్థం చేసుకోవద్దు ఎన్ని ప్రశ్నలున్నా అడగండి.. చెబుతాను.. మనసులో ఏదో ఊహించుకుని నన్ను దూరంపెట్టకండి.. నేను తట్టుకోలేను..అని రిషి కౌగిలిలో బంధీ అయినట్టుగా.. రిషి కూడా హత్తుకున్నట్టుగా వసు భ్రమిస్తుంది.

    ఇదంతా నా ఊహేనా? ఎన్నో అనుకున్నాను.. ఎన్నో మాట్లాడాలని చూశాను. కానీ ఇప్పుడేంటి? ఇలా అయిపోయాను అని వసు తనలో తాను అనుకుంటుంది. ఆ తరువాత వసు కిచెన్‌లోకి వెళ్తుంది. అలా సీన్ కట్ చేస్తే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్ జరుగుతుంది మధ్యలో. ఆ తరువాత మళ్లీ సీన్ కట్ చేస్తే.. రిషి వసుల మీద ఓపెన్ అవుతుంది. వసు రూంలోకివెళ్తాడు రిషి. నెమలి పించం చూస్తాడు. గతాన్ని గుర్తుకు చేసుకుంటాడు. ఇంతలో వసు రూంలోకి వస్తుంది.

    ఏం వెతుకుతున్నారు సర్ అని అంటే.. బుక్స్ అని సమాధానం ఇస్తాడు రిషి.. ఇంపార్టెంట్ టాపిక్ టిక్ చేసిస్తాను అని అంటాడు. వసు బుక్ తీసి ఇస్తుంది. అయ్యే వంటగదిలో పాలు పెట్టాను అని వసు రమ్మని చెబుతుంది. ఇక వసు చీరను చూసి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తాడు రిషి. చీరలో ఎలా ఉన్నాను సర్ అని వసు అన్న నాటి సంగతులను గుర్తు చేసుకుంటాడు. మళ్లీ సీన్ ఇక్కడ కట్ చేస్తే ఇంట్లో దేవయాణి మీద ఓపెన్ అవుతుంది.

    రిషి నన్ను గౌరవిస్తూనే ఉన్నట్టు అనిపిస్తుంది.. అప్పుడప్పుడు దూరం పెట్టినట్టు అనిపిస్తోంది. రిషిలో మార్పు వచ్చింది. మహేంద్రను అడిగితే చెప్పడు.. ఇక మిగిలింది ధరణి. ఇప్పుడు దాన్ని ప్రేమగా పిలవాలా? అని అనుకుంటుంది దేవయాణి. తప్పదు కదా? అని ప్రేమగా పిలుస్తుంది. ఫోన్ తీసుకుని రా అని అంటుంది. అందులోంచి రిషికి ఫోన్ చేస్తుంది. ఇక వచ్చే వారం ఎపిసోడ్‌లో దేవయాణి ఫోన్ చేసినట్టు.. వదిన అనుకుని ఫోన్ లిఫ్ట్ చేయడంతో.. పెద్దమ్మ గొంతు వినిపిస్తుంది. ఎక్కడున్నావ్ అనే అడిగితే.. పక్కనే వసు గొంతు వినిపిస్తుంది.. కాఫీ,టీ ఏది సర్ అని అడుగుతుంది. దీంతో దేవయాణికి డౌట్ వస్తుంది. పక్కన ఎవరో అమ్మాయి ఉన్నట్టున్నారు.. ఎవరు అని అడుగుతుంది. మళ్లీ ఫోన్ చేస్తాను అని కట్ చేస్తాడు రిషి. నేను ఏమైనా అడిగానా? నీ రెస్టారెంట్‌కు వచ్చానా? అని వసు మీద మళ్లీ ఫైర్ అవుతాడు రిషి. మరి ఈ కథ మళ్లీ ఎటు తిరుగుతుందో చూడాలి.

    Leave a Reply