• November 1, 2021

తెలంగాణలో మొట్టమొదటి గే కపుల్.. సమంత రియాక్షన్ అదుర్స్

తెలంగాణలో మొట్టమొదటి గే కపుల్.. సమంత రియాక్షన్ అదుర్స్

    సమాజంలో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఆడ మగ అనేది ప్రకృతి సహజంగా ఉంటాయి. ఆడ మగ మధ్య ఆకర్షణ, ఆడ మగ పెళ్లి అనేది ప్రకృతి ధర్మం అనే మాటలు వినిపిస్తుంటాయి. కానీ ఇవన్నీ ఒకప్పటి మాటలు. ఇప్పుడు దారులుమారాయి. ఆలోచన ధోరణలు మారుతున్నాయి. ఎవరి ఆలోచనలకు తగ్గట్టుగా వారు మెదులుతున్నారు. ఈ క్రమంలో లెస్బియన్, గే, ట్రాన్స్ జెండర్ల కల్చర్ ఎక్కువగా పెరిగిపోయింది. అమ్మాయిలు అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్నారు.

    అబ్బాయిలు అబ్బాయిలను పెళ్లి చేసుకుంటున్నారు. ఇలాంటి ధోరణి అంతటి వ్యాపించింది. అయితే తెలంగాణలో మొట్టమొదటి గే జంట బయటకు వచ్చింది. ఇద్దరు మగాళ్లు పెళ్లి చేసుకున్నారు. ఇందరికీ ఆశ్చర్యం వేసినా కూడా నిజం. ఆ ఇద్దరూ గతకొన్నేళ్లుగా లివ్ ఇన్ రిలేషన్ షిప్‌లో ఉన్నారట. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వారి ప్రేమ.. చివరకు పెళ్లి వరకు వచ్చిందట. ఇంట్లో వాళ్లుకూడా దీనికి ఒప్పుకున్నారట.

    ఇండియన్ పేరెంట్స్ అంటే ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. కానీ దానికి భిన్నంగా.. ఆ ఇద్దరినీ తల్లిదండ్రులు అర్థం చేసుకున్నారట. పెళ్లికి అంగీకరించారట. మొత్తానికి సమాజంలో మాత్రం వింత మార్పులే వస్తున్నాయి. అయితే ఈ గే జంటపై సమంత స్పందించింది. ఇద్దరికి కంగ్రాట్స్ చెప్పింది. తెలంగాణ అంటూ గర్వంగా చెప్పుకున్నట్టు కనిపిస్తోంది. ఇక సమంత మాత్రమే కాదు.. అటు వైపు సమంత మేకప్ ఆర్టిస్ట్ సాధన సింగ్ కూడా వారికి కంగ్రాట్స్ చెప్పింది. ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

    Leave a Reply