• November 1, 2021

RRR Glimpse : ఇదొక్కటి చాలు.. జక్కన్క ఏంటో చెప్పడానికి

RRR Glimpse : ఇదొక్కటి చాలు.. జక్కన్క ఏంటో చెప్పడానికి

    దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బాహుబలి సినిమాలతో అంతర్జాతీయంగా తన ముద్ర వేసుకున్నాడు రాజమౌళి. ఇక తాను తీసే సినిమాపై ప్రపంచ దేశాల దృష్టి పడిందని గ్రహించిన రాజమౌళి.. ఆ స్థాయి సినిమాలను తెరకెక్కించేందుకు సిద్దపడ్డాడు. అందులో భాగంగానే ఎన్టీఆర్, రామ్ చరణ్‌లో కలిసి ఆర్ఆర్ఆర్ అంటూ సినిమాను తీసుకొస్తున్నాడు. ఈ చిత్రానికి మొదటి నుంచి ఎన్నో అడ్డంకులు వచ్చాయి. కరోనా అయితే ఘోరంగా దెబ్బ కొట్టేసింది. ఎప్పుడో రావాల్సిన ఈ సినిమాను ఇంత ఆలస్యం చేసింది కరోనా.

    మొత్తానికి వచ్చే ఏడాది జనవరి 7న ఆర్ఆర్ఆర్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ పెంచేసింది చిత్రయూనిట్. ఇది వరకు వదిలిన గ్లింప్స్, టీజర్లు, పోస్టర్లు, దోస్తీ పాట అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ కూడా గత వారమే వచ్చేది. కానీ పునీత్ రాజ్ కుమార్ మరణించడంతో అప్డేట్‌ను వాయిదా వేశారు.

    మొత్తానికి కాసేపటి క్రితం వదిలిన ఈ గ్లింప్స్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో మాటలు లేకపోయినా విజువల్స్‌తో రాజమౌళి కట్టిపడేశాడు. ఈ 40  సెకన్ల వీడియోలతో ఎన్నో అద్బుతాలు చూపించాడు రాజమౌళి. ఎన్టీఆర్, రామ్  చరణ్‌ను ఇంకెవ్వరూ చూపించలేనంత పవర్ ఫుల్‌గా చూపించేశాడు.

    ప్రతీ ఒక్క పాత్రను పరిచయం చేశాడు. ఒలివియా మోరిస్, అలియా భట్, అజయ్ దేవగణ్ ఇలా అందరినీ చూపించేశాడు. యుద్ద సన్నివేశాలు మాత్రం నెవ్వర్ బిఫోర్ అనేలా ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫైటింగ్ సీన్ అదిరిపోయేలా ఉండనుంది. మొత్తానికి జక్కన్న మాత్రం మ్యాజిక్ చేసేశాడు.

    Leave a Reply