- November 24, 2021
‘హష్’ బర్త్ డే.. సమంత సెలెబ్రేషన్స్!.. నాగ చైతన్యను పట్టించుకోని సామ్
సమంత చేష్టలు ఎవ్వరికీ అర్థం కావడం లేదు. నిన్న (నవంబర్ 23) నాగ చైతన్య బర్త్ డే. సమంత స్పందిస్తుందా? విషెస్ చెబుతుందా? అని అభిమానులు ఎదురుచూశారు. కానీ సమంత మాత్రం అస్సలు పట్టించుకోలేదు. నాగ చైతన్యకు సంబంధించి ఒక్క పోస్ట్ చేయలేదు. బర్త్ డే విషెస్ చెప్పలేదు. భార్యాభర్తలుగా విడిపోయారు. అది నిజమే. కానీ కనీసం బర్త్ డేలకు విషెస్ చెప్పుకునేంత సాన్నిహిత్యం కూడా లేదా? అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఎంతో మంది విడిపోయిన జంటలున్నారు.. వేరే వాళ్లను పెళ్లి చేసుకున్నా కూడా వారి స్నేహ బంధాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అలా ఎంతో మంది సెలెబ్రిటీలున్నారు ఇప్పుడు. కానీ సమంత నాగ చైతన్యలు మాత్రం విడిపోయినా తరువాత కూడా ఇంకా వాటినే తలుచుకుంటూ ద్వేషంతోనే ఉంటున్నట్టు అనిపిస్తుంది. నాగ చైతన్య బర్త్ డే సందర్భంగా సమంత ట్వీట్ గానీ పోస్ట్ గానీ వేయలేదు. సమంత బిజీగా ఉండి పోస్ట్ వేయలేదు అని అనుకోవడానికి వీల్లేదు.
ఎందుకంటే సమంత సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గానే ఉంటుంది. అలాంటి సమంతకు నాగ చైతన్య బర్త్ డేకు ఓ పోస్ట్ వేయడం క్షణాల్లో పని. కానీ సమంత కావాలనే వేయలేదని తెలుస్తోంది. తాజాగా హష్ బర్త్ డే సంబంధించిన సెలెబ్రేషన్స్, వాటికి సంబంధించిన ఫోటోలను సమంత షేర్ చేసింది. ఇందులో సమంత ఎంత సంతోషంగా ఉందో కనిపిస్తోంది.
సమంతకు హష్ అంటే ఎంతిష్టమో అందరికీ తెలిసిందే. హష్‌ను తన బిడ్డలా పెంచుకుంటోంది. హష్ అంటే చైతూకి కూడా ఇష్టమే. అయితే నాగ చైతన్య బర్త్ డేను పట్టించుకోని సామ్ మాత్రం హష్ బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసినట్టు కనిపిస్తోంది. హష్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ సాధన షేర్ చేసిన పోస్ట్‌ను సమంత తన స్టోరీలో పెట్టేసింది. ఇక తన అభిమానులు హష్ గురించి పెట్టే పోస్ట్‌లను కూడా సమంత షేర్ చేసింది. అయితే నాగ చైతన్యకు సమంత పర్సనల్‌గా ఏమైనా విషెస్ చెప్పి ఉండొచ్చు.