- October 22, 2021
చెంపదెబ్బ కొట్టి సారీ చెప్పినట్టు ఉంటుంది!.. సమంత లాయర్ సంచలన కామెంట్స్
సమంత ప్రస్తుతం యూట్యూబ్ చానెళ్ల మీద వేసిన కేసుపు చర్చలు విపరీతంగా నడుస్తున్నాయి. డాక్టర్ సీఎల్ వెంకట్రావు తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేలా ప్రసారాలు చేశారని వారిపై పరువు నష్టం దావా వేసింది సమంత. ఇందులో రెండు యూట్యూబ్ చానెళ్లు, డాక్టర్ సీఎల్ వెంకట్రావు పేర్లను పిటీషన్‌లో సమంత పేర్కొంది. అయితే ఈ కేసు ఇప్పుడు కూకట్ పల్లి కోర్టులో నడుస్తోంది. నిన్న వాదోపదాలు జరిగాయి. తీర్పు నేటికి వాయిదా వేశారు.
అయితే ఈ క్రమంలో సమంత తరుపు లాయర్ సీనియర్ హైకోర్టు అడ్వకేట్ బాలాజి నిన్న మీడియాతో మాట్లాడాడు. ఈ క్రమంలో కొన్ని కామెంట్లు చేశాడు. సమంత పరువుకు భంగం కలిగేలా, వారి వ్యక్తిగత జీవితంలో జరగని సంఘటన గురించి రాసి ఆమెను ప్రతిష్టకు భంగం కలిగించారు. అందుకే వారిపై పరువునష్టం దావా వేశామని లాయర్ పేర్కొన్నాడు. అంతేకాకుండా వారే భేషరతుగా క్షమాపణలు చెప్పాలని అన్నాడు. అయితే ఇందులో జడ్జ్ చెప్పిన మాటలను కూడా పట్టించుకోలేదని తెలుస్తోంది.
పరువు నష్టం దావా ఎందుకు? క్షమాపణలు చెప్పిస్తే సరిపోతుంది కదా? అని న్యాయమూర్తి అన్నారట. కానీ సమంత తరుపున లాయర్ మాత్రం అందుకు ఒప్పుకోలేద. అది ఎలా ఉందంటే చెంపదెబ్బ కొట్టి సారి చెబుతాను అని అంటే ఎలా ఉంటుందో.. అలా ఉంది అని అన్నాడు. మొత్తానికి ఈ కేసును మాత్రం అంత ఈజీగా వదిలేలా లేరు. వారిని కోర్టుకీడ్చి పరువు నష్టం దావా వేసేంత వరకు వదిలేలా లేదు. ఇప్పుడు తమ దృష్టికి వచ్చిన చానెళ్ల మీద మాత్రమే వేశాం.. భవిష్యత్తులో ఇంకా మా దృష్టికి, సమంత దృష్టికి వస్తే వాటి మీద కూడా వేస్తామని అన్నాడు.