నారి నారి నడుమ మురారి!.. ఇరువురు భామలతో రెచ్చిపోయిన రాజీవ్ కనకాల

నారి నారి నడుమ మురారి!.. ఇరువురు భామలతో రెచ్చిపోయిన రాజీవ్ కనకాల

     

    రాజీవ్ కనకాల ఈ మధ్య బుల్లితెరకు కాస్త దూరమయ్యాడు. లేదంటే ఒకప్పుడు బుల్లితెరపై బిజీగా ఉన్న ఆర్టిస్టుల్లో రాజీవ్ కనకాల ముందుండేవాడు. దూరదర్శన్ సీరియల్స్ నుంచి రాజీవ్ ఫుల్ బిజీగా ఉన్నాడు. మధ్యలో ఎన్నో సీరియల్స్ చేశాడు. శాంతినివాసం వంటి సూపర్ హిట్ సీరియల్స్‌లో నటించాడు. ఇక సినిమాల కోసం సీరియల్స్‌ను కాస్త పక్కకు పెట్టేశాడు.

    మధ్యలో ఎన్నో షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఎంటర్టైన్మెంట్ షోలకు వ్యాఖ్యాతగా కూడా చేశాడు. అలా ఒకప్పుడు బుల్లితెరను ఏలిన రాజీవ్ కనకాల ఈ మధ్య మొత్తానికి దూరంగా ఉంటున్నాడు. కానీ ఈటీవీలో రెండు నెలల క్రితం రెచ్చిపోదాం బ్రదర్ అనే షో ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. కానీ కొన్ని రోజులకే ఆ షో నుంచి తప్పుకున్నాడు. ఆ స్థానంలో బాబా భాస్కర్ వచ్చేశాడు.

    అయితే జీ కుటుంబం వేడుకలో రాజీవ్ కనకాల దుమ్ములేపేశాడు. తాజాగా ఈ ఈవెంట్‌కు సంబంధించిన ప్రోమోను వదిలారు. ఇందులో రాజీవ్ కనకాల ఇద్దరు భామలతో రెచ్చిపోయి మరీ డ్యాన్సులు వేశాడు. త్రినయని విలన్, మిఠాయి కొట్టు చిట్టెమ్మ సీరియల్స్ విలన్స్‌తో స్టెప్పులు వేశాడు. మొత్తానికి రాజీవ్ కనకాలలో మంచి ఊపు కనిపించింది.

    Leave a Reply