- February 11, 2022
Khiladi Twitter Review : ఖిలాడి ట్విట్టర్ రివ్యూ.. అదిరిపోయిందట
Khiladi Movie Twitter Review మాస్ మహారాజా రవితేజ హీరోగా డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా వచ్చిన సినిమా ఖిలాడి. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహించాడు. మొత్తానికి ఈ చిత్రం నేడు (ఫిబ్రవరి 11) థియేటర్లోకి వచ్చింది. సోషల్ మీడియాలో ఆల్రెడీ రవితేజ అభిమానుల సందడి మొదలైంది.
#Khiladi after karck second blackbuster for #MassMaharaja🔥💥
Asalu ha action secens mamulga lev💥
Overall ga bomma hittuuu 🔥— Ajay (@Ajay07735783) February 11, 2022
క్రాక్ సినిమా తరువాత మరో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది.. యాక్షన్ సీక్వెన్స్ మామూలుగా లేవు.. ఓవరాల్‌గా బొమ్మ హిట్టు.. ఫస్ట్ హాఫ్ కాస్త బోరింగ్‌గా అనిపించినా, ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ సీన్లు మాత్రం మామూలుగా లేవని అంటున్నారు.
#Khiladi
1st half kunchum bore, pre interval 🔥, interval twist💥💥💥💥— Rajesh (@Rajesh136189) February 11, 2022
సినిమా స్టోరీ బాగానే ఉంది.. కానీ టేకింగ్ బాగా లేదు.. మొత్తంగా ఇదొక యావరేజ్ సినిమా అని ఇంకొందరు అంటున్నారు. యూఎస్‌లో మాస్ సినిమాలు ఎక్కువగా ఆడవు.. అక్కడ యావరేజ్ అని అంటే ఇక్కడ సూపర్ హిట్ అని అర్థమంటూ ఇంకొందరు ట్వీట్లు పెడుతున్నారు.
ఖిలాడీ సూపర్ హిట్ అంటా.. కోవిడ్ తరువాత ఇది శుభారంభం అని అంటున్నారు. మొత్తానికి రవితేజ ఖిలాడీ సినిమా మాత్రం అన్ని వైపుల నుంచి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. పూర్తి రివ్యూ రావాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సింది.