• February 11, 2022

Karthika Deepam నేటి ఎపిసోడ్.. మళ్లీ అలజడి మొదలు.. మోనిత ఎంట్రీతో కార్తీక్, దీపలు షాక్

Karthika Deepam నేటి ఎపిసోడ్.. మళ్లీ అలజడి మొదలు.. మోనిత ఎంట్రీతో కార్తీక్, దీపలు షాక్

    కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే ఫిబ్రవరి 11న శుక్రవారం నాటి Karthika Deepam Episode 1273 ధారావాహికలో ఎమోషనల్ సీన్స్ పడ్డాయి. మంచి మనిషిగా రుద్రాణి మారిపోయింది. ఇక మరో వైపు అందరూ కలిసి హైద్రాబాద్ ఇంట్లో ఆనందంగా ఉంటారు. దీప, కార్తీక్, సౌందర్య, ఆదిత్య, శ్రావ్య ఇలా అందరూ హ్యాపీగా ఉంటారు. ఒక మరో వైపు మోనిత ఆలోచనల్లో పడుతుంది. కార్తీక్‌ను వెతికేందుకు లక్ష్మణ్‌ను పంపిస్తుంది. అలా మొత్తానికి కార్తీక దీపం నేటి ఎపిసోడ్ ముందుకు సాగింది.

    రుద్రాణి మారిపోతుంది. ఇకపై వడ్డీ వ్యాపారం కూడా చేయను.. ఈ చెక్ కూడా తీసుకోండని అంటుంది రుద్రాణి. ఆ డబ్బులు మీరే ఉంచుకోండి.. నలుగురు అనాథ పిల్లలను పెంచుకో అని సౌందర్య అంటుంది.. మంచి చదువు చెప్పించు అని అంటుంది.. ఈ ఇళ్లు ఆనందుకు చెందుతుంది..అప్పటి వరకు అనాథాశ్రమంగా వాడండి.. అని కార్తీక్ అంటాడు.మీరు చాలా గొప్పవారు.. సారీ అమ్మా. నన్ను క్షమించండి.. నన్ను, నా మనసు మార్చేసి వెళ్తున్నారు.. మీరు బాగుండాలమ్మా.. అని అంటుంది. ఆ సేటుకి మీ నగలు ఇచ్చేయమని అందుకే చెప్పాను.. అని రుద్రాణి లోలోపల అనుకుంటుంది.

    హోటల్‌లో అప్పారావ్ దగ్గర మీ డాడీ ఫోటో చూశాను అని సౌందర్య అంటుంది.. అప్పారావ్ మామ సినిమాల్లో యాక్టింగ్ చేస్తాడట అని శౌర్య నవ్వుతుంది.. కష్టపడితే ఏదైనా సాధ్యమే నాన్న అని సౌందర్య అంటుంది. ఇక ఇంట్లోకి అందరూ వచ్చే సమయంలో దిష్టి తీయమని శ్రావ్యకు చెబుతుంది సౌందర్య. ఇవన్నీ ఎందుకు ఏం సాధించామని ఇవ్వని.. అని కార్తీక్ అంటాడు.

    దూరమైతే ఎంత బాధుంటుందో తెలిసింది.. ప్రేమలు, బంధాలు, సౌకర్యాలు, పేదరికం ఇవన్నీ నేర్పించావ్.. బడి పాఠాలు ఎవ్వరైనా చెబుతారు.. జీవిత పాఠాలు నేర్పించావ్ అని ఇలా కార్తీక్ గురించి సౌందర్య చెబుతుంది. నువ్ పొగుడుతుంటే.. తిడుతున్నట్టే ఉంది.. అని కార్తీక్ అంటాడు. ఇక కార్తీక్, దీపలు వెళ్లడంతో అప్పారావ్ బాధపడతాడు.

    వారి దగ్గరకే వెళ్తాను అని భద్రంతో అప్పారావ్ అంటాడు. తక్కువ టైంలోనే బావా అని పిలవడం ఏంటో.. నా మనసంతా ఏదోలా ఉంది.. అంత గొప్పోల్లైనా కూడా కరెక్ట్ కూడా పని చేశారు అని అప్పారావ్, భద్రం మాట్లాడుకుంటారు.. ఒకరికి తెలియకుండా ఒకరి పని చేశారు.. అంత కష్టం ఎందుకు వచ్చిందో.. ఎందుకు అలా చేశారు..అని అనుకుంటారు. రుద్రాణి చెక్కు విసిరి కొట్టేసిందట.. కష్టాలు అన్నీ తీరిపోయాయ్.. మన ఇంట్లో వాళ్లకి కష్టాలు వస్తే సాయం చేయడం కాదు.. ముక్కూ మొహం తెలియని చిన్నోడి కోసం కష్టాలు పడ్డారు అందుకే వాళ్లు గొప్పవారు అని అప్పారావ్ అంటాడు. హైద్రాబాద్‌కు వెళ్తాను.. అక్క వాళ్లింట్లోనే ఉంటాను.. సినిమాలు, సీరియల్స్‌లో నటిస్తాను అని అప్పారావ్ అంటాడు

    రౌడీ ఎలా ఉంది నీకు అని కార్తీక్ అడుగుతాడు.. నానమ్మ వాళ్లింట్లోకి వచ్చాక నాకు చాలా సంతోషంగా ఉంది.. నానమ్మ, బాబాయ్, దీపు, పిన్ని గాడిని చూశాక సంతోషంగా.. ఇంకెప్పుడూ బయటకు తీసుకెళ్లొద్దు అని శౌర్య అంటుంది. సారీరా రౌడీ అని కార్తీక్ అంటాడు.. ఏంటి డాక్టర్ బాబుతో సారి చెప్పించుకుంటున్నావ్.. అని దీప అంటుంది. నేను ఎన్ని సార్లు సారీ చెప్పినా కూడా తక్కువే అవుతుంది.. ఇబ్బంది పెట్టాను కాదు కష్టాలు పెట్టాను అని కార్తీక్ అంటాడు.. తాడికొండ విషయాలు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది.. అని దీప చెబుతుంది. మళ్లీ ఇళ్లు దాటి వెళ్లొద్దు.. అని శౌర్య అంటుంది. ఏంటి ముగ్గురు మీటింగ్ పెట్టారు.. నాకు తెలుసు పిల్లలు ఇళ్లు దాటాకా భయపడ్డారు అని సౌందర్య అంటుంది. మనం ముగ్గురం ఒక జట్టు.. మనల్ని ఇక ఎవ్వరూ వేరు చేయలేరు.. ఈ ఇంటికి బాస్ ఎవరు.. అని సౌందర్య అడిగితే.. నువ్వే ఇంకెవరు.. అని శౌర్య అంటుంది.

    విన్ని కాఫీ అని మోనిత అడుగుతుంది. కానీ అరుణ పని చేస్తూ కనిపిస్తుంది. విన్ని బయటకు వెళ్తే ఇళ్లంతా కూడా శుభ్రం చేశాను అని అరుణ చెబుతుంది. నువ్వెంత మంచి దానివి అరుణ చెప్పకపోయినా కూడా పని చేస్తున్నావా? ఏంటో ఈ బస్తీవాళ్లు.. కోపమైనా, ప్రేమైనా ఎక్కువే.. నా కార్తీక్ కూడా ఇలానే మారుతాడు.. కార్తీక్ ఎక్కడ మాయమైనట్టు. నాతో దాగుడు మూతలు ఆడుతున్నావా? అని సౌందర్య గురించి మోనిత ఆలోచిస్తుంది. ఇక మోనిత బాబాయ్ అంటూ కొత్త కారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. ఫోన్ చేసి మోనితతో మాట్లాడతాడు.

    ఇంట్లో ఆనంద్ గుక్క పట్టి ఏడుస్తుంటాడు..ఏంటే వీడసలు ఏడుపు ఆపడం లేదు.. నేను ఎత్తుకుంటాను ఆగు..అని సౌందర్య ఎత్తుకుంటుంది. నీకు వీడి గురించి తెలీదు అని హిమ అంటుంది.. ఉయ్యాల్లో వేయాలా? జో కొట్టాలా?.. అని సౌందర్య అంటుది. ఇప్పుడు ఏడుపు ఆపేస్తాడు చూడు అని కార్తీక్‌ను ఎత్తుకోమని అంటుంది హిమ… నానమ్మ నేను చెప్పాను కదా? డాడీ ఎత్తుకుంటే సైలెంట్ అవుతాడు.. సంతోషపడతాడు.. అని హిమ అంటుంది. నా కొడుకు ఎత్తుకుంటే ఎందుకురా సంతోషపడుతున్నావ్.. అని సౌందర్య అంటుంది. మొదటి నుంచి వీడు ఇంతే.. అని హిమ అంటుంది.

    తాడికొండ చుట్టూ ఉన్న ఊర్లలో కార్తీక్ ఉన్నాడు.. నేను అంతా వెతికాను.. ఇక్కడ నేను నా బాబుని వెతుకుతాను.. నువ్ అక్కడ వెతుకు.. దీప మీకేం చేసిందో గానీ.. నేను మాత్రం మీకు మంచి చేసే ఇక్కడి నుంచి వెళ్తాను.. డబ్బు కోసం చేసే పనికి, మనసుతో చేసే పనికి తేడా ఉంటుంది.. తాడికొండకు వెళ్లమని, వెతకమని డబ్బులు ఇస్తుంది మోనిత. వాటిని తీసుకుని లక్ష్మణ్ బయల్దేరుతాడు. కార్తీక్, నన్ను విడగొట్టడంలో సౌందర్య ఆంటీ మొదటి వ్యక్తి.. తనే ప్లాన్ చేసి కలుసుకోకుండా చేస్తుందా? మీరే ఏదో ఒకటి చేసి ఉంటారు.. కార్తీక్‌ని త్వరలోనే చేరుకుంటాను..అని అంటుంది.

    ఏంటే మీ ఆనందం.. అని సౌందర్య అంటుంది. ఆనంద్ ఉంటే చాలు అత్తయ్య వీళ్లకు అని దీప అంటుంది.. పాపం ఏ తల్లి బిడ్డో మన ఇంటికి చేరాడు.. అని సౌందర్య అంటుంది. తమ్ముడిని బాగా చూడు.. నాన్నలానే ఉంటాడు కదా? అని శౌర్య అనడంతో అంతా షాక్ అవుతారు. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో కార్తీక్, దీప ఆనందాన్ని మోనిత చెడొట్టేలా కనిపిస్తోంది.

    Leave a Reply