- February 11, 2022
Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. ఒంటరిగా రిషి, వసుధార.. షాకైన గౌతమ్

గుప్పెడంత మనసు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ అంటే ఫిబ్రవరి 11న శుక్రవారం ప్రసారం కానున్న Guppedantha Manasu Episode 371 ధారావాహికలో వసు, రిషిలు లైబ్రరీలో చిక్కుకుపోతారు. ఇక గౌతమ్ చార్ట్ మిస్ అవుతాడు. అది చివరకు మహేంద్ర వద్దకు చేరుకుంటుంది. చివరకు లైబ్రరి నుంచి బయటకు వచ్చేందుకు వసు, రిషిలు ప్రయత్నిస్తారు. అలా ఎపిసోడ్ ముగుస్తుంది.
గౌతమ్ తెచ్చుకున్న చార్ట్ మారిపోతుంది. అది చివరకు మహేంద్ర టేబుల్ వద్దకు చేరుతుంది. ఏం చేస్తున్నావ్ జగతి అని మహేంద్ర అడగడం.. ఏం ఆలోచిస్తున్నావ్ జగతి.. పండక్కి వచ్చి వెళ్లిన విషయమా? అని మహేంద్ర అడుగుతాడు. నేను ఎప్పుడో మరిచిపోయాను..నవ్వే ఇంకా మోస్తున్నావ్.. షార్ట్ ఫిల్మ్ గురించి ఆలోచిస్తున్నా.. ఎడారి ప్రాంతంలోనూ పదేళ్లకు ఒకసారి వర్షం కురుస్తుందట.. నేను కూడా అలనా వచ్చాను వెళ్లాను.. ఎడారిలో ప్రతీ రోజూ వర్షం పడాలనుకోవడం అత్యాశే అవుతుంది.. అని జగతి అంటుంది. ఈ టాపిక్‌ను మనసులో పెట్టుకుని రిషిని విసిగించడం లేదు కదా? అని మహేంద్రను జగతి అడుగుతుంది. నేను ఎందుకు విసిగిస్తాను..పది సార్లు ఆలోచిస్తాను..ఏదైనా మాట్లాడేందుకు అని మహేంద్ర అంటాడు.
చార్టులను తెరిచి చూసేందుకు జగతి రెడీ అవుతుంది. ఇంతలోనే మీటింగ్‌కు రమ్మని ప్యూన్ పిలుస్తాడు. ఇక మహేంద్ర కూడా అది ఓపెన్ చేసి చూసే లోపు ఏదో ఫోన్ వస్తుంది. అలా మొత్తానికి వసు బొమ్మ ఉన్న చార్ట్ చూడకుండానే పోయారు. ఇక సీన్ లైబ్రరిలో ఓపెన్ అవుతుంది. ఎవ్వరూ లేరని అనుకుని లైబ్రరినీ మూసేసి వెళ్లిపోతాడు.
కానీ లోపల వసు, రిషి ఇరుక్కుపోతారు. కరెంట్ పోయిందని ముందు అనుకున్నా.. చివరకు లైబ్రరీ మూసేసి వెళ్లిపోయారని తెలుసుకుంటాడు. ఇక వసు, రిషిలు లోపలే ఉంటాడు. ఎక్కువగా టెన్షన్ పడకండి.. అని వసు అంటుంది. ఇక ఆమె ధ్యానంలో మునిగిపోతుంది. రిషి ఏమో లైబ్రేరియన్‌కు, వాచ్ మెన్‌లకు ఫోన్ చేస్తాడు. లైబ్రేరియన్ ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయడు.
కాస్త ప్రశాంతంగా ఫోన్ చేయండి లిఫ్ట్ చేస్తాడు అని వసు చెప్పడంతో.. మళ్లీ రిషి ఫోన్ చేస్తాడు. ఈ సారి లైబ్రేరియన్ ఫోన్ చేస్తాడు. ఎందుకు లిఫ్ట్ చేయలేదంటూ రిషి అరుస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేశాడు కదా? ఎందుకు కూల్.. అని వసు అంటుంది. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో లైబ్రరిలో ఉన్న వసు, రిషిలను గౌతమ్ చూస్తాడు. షాక్ అవుతాడు.