- March 27, 2022
RRR Collection : నైజాంలో చరిత్ర.. రెండో రోజూ కలెక్షన్ల సునామీ

RRR Day 2 Collection రాజమౌళి దెబ్బకు ఆర్ఆర్ఆర్ సినిమా రెండో రోజు కూడా అనుకున్నట్టుగా చెలరేగిపోతోంది. అన్ని చోట్లా పాజిటివ్ టాక్ రావడంతో రికార్డుల వేట సులభమైంది. రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి దెబ్బకు రికార్డులు విలవిల్లాడాయి. మొదటి రోజు కళ్లు చెదిరే రికార్డులను సొంతం చేసుకుంది. ఇక రెండో రోజు సైతం దుమ్ములేపేసింది. నైజాం కింగ్‌గా ఆర్ఆర్ఆర్ సినిమా నిలిచింది. టాలీవుడ్ హిస్టరీలో హయ్యస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా రికార్డులకెక్కింది.
నైజాం ఏరియాలో మొదటి రోజే 23.35కోట్లు కొల్లగొట్టేసింది. సీడెడ్‌లో 17, ఉత్తరాంద్రలో 7.42, ఈస్ట్ 5.39, వెస్ట్ 5.93, గుంటూరు 7.80, కృష్ణా 4.21, నెల్లూరు 3.01 అలా మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 74.11 కోట్లు కొల్లగొట్టేసింది.
అలా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 223 కోట్ల గ్రాస్‌ను రాబట్టేసింది. ఓవర్సీస్లో ఏకంగా దాదాపు 70 కోట్లు రాబట్టేసింది. మొత్తానికి మొదటి రోజుతో సమానంగా రెండో రోజు సైతం కలెక్షన్లను రాబట్టేసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా నైజాంలో ఆర్ఆర్ఆర్ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.
నైజాం ఏరియాలో రెండో 15.10కోట్ల షేర్ కొల్లగొట్టేసింది. బాహుబలి 2 కేవలం 4.84 కోట్లు రాబట్టింది. భీమ్లా నాయక్ అయితే 7.48 కోట్లు, పుష్ప 7.40 కోట్లు రాబట్టేసింది. వీటన్నంటికంటే రెట్టింపు వసూళ్లను రెండో రోజు ఆర్ఆర్ఆర్ కలెక్ట్ చేసింది.