- March 26, 2022
RRR Collection : నయా హిస్టరీ.. అన్ని రికార్డులు ఖతం.. కలెక్షన్ల కుంభస్థలం బద్దలు
RRR Day 1 Collection సినిమా అనుకున్నట్టుగా చెలరేగిపోతోంది. అన్ని చోట్లా పాజిటివ్ టాక్ రావడంతో రికార్డుల వేట సులభమైంది. రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి దెబ్బకు రికార్డులు విలవిల్లాడాయి. మొదటి రోజు కళ్లు చెదిరే రికార్డులను సొంతం చేసుకుంది. నైజాం కింగ్‌గా ఆర్ఆర్ఆర్ సినిమా నిలిచింది. టాలీవుడ్ హిస్టరీలో హయ్యస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా రికార్డులకెక్కింది.
నైజాం ఏరియాలో మొదటి రోజే 23.35కోట్లు కొల్లగొట్టేసింది. భీమ్లా నాయక్ (11.85), పుష్ప (11.44), రాధే శ్యామ్ (10.80) మాత్రమే కొల్లగొట్టేశాయి. మొదటి రోజు 20 కోట్ల నుండి 22 కోట్ల రేంజ్‌లో షేర్‌ని అందుకునే ఛాన్స్ ఉండగా సీడెడ్ ఏరియాలో 13-14 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నైజాం ప్లస్ సీడెడ్ కలిపి మొదటి రోజే నలభై కోట్ల వరకు కొల్లగొట్టి కొత్త చరిత్ర రచించింది ఆర్ఆర్ఆర్.
ఇక తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు మొదటి రోజు 65 కోట్ల నుండి 68 కోట్ల మధ్యలో షేర్‌ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా… ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే 120 కోట్ల వరకు వసూల్ చేసేట్టు కనిపిస్తోంది. మొత్తానికి వీకెండ్‌లోనే దాదాపు నాలుగొందల కోట్లు కొల్లగొట్టేట్టు కనిపిస్తోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి దండయాత్ర చేస్తుండటంతో ఇకపై తెలుగు నాట నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డులు అని అనాల్సి వస్తుందేమో.
- Tags
- RRR Day 1 nizam Collection
- RRR Day 1 Worldwide Collection
- RRR Movie Collection
- RRR Movie Day 1 ceeded Collection
- RRR Movie Day 1 Collection
- RRR Movie Day 1 overseas Collection
- RRR Movie Day 1 Worldwide Collection
- RRR కలెక్షన్
- RRR కలెక్షన్స్
- RRR ఫస్ట్ డే కలెక్షన్
- RRR ఫస్ట్ డే నైజాం కలెక్షన్స్
- RRR మొదటి రోజు కలెక్షన్
- RRR మొదటి రోజు కలెక్షన్స్
- ఆర్ఆర్ఆర్ కలెక్షన్
- ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్
- ఆర్ఆర్ఆర్ ఫస్ట్ డే కలెక్షన్
- ఆర్ఆర్ఆర్ ఫస్ట్ డే నైజాం కలెక్షన్స్
- ఆర్ఆర్ఆర్ మొదటి రోజు కలెక్షన్