• December 28, 2021

RRR : 13 ఏళ్ల క్రితమే కర్చీప్ వేసిన దానయ్య!.. అసలు విషయం చెప్పిన రాజమౌళి

RRR : 13 ఏళ్ల క్రితమే కర్చీప్ వేసిన దానయ్య!.. అసలు విషయం చెప్పిన రాజమౌళి

    Rajamouli DVV Danayya రాజమౌళి సినిమా అంటే.. కేవలం రాజమౌళి మాత్రమే కనిపిస్తాడు. ఇంక అందులో ఎవ్వరూ కనిపించరు. హీరో హీరోయిన్ విలన్ మ్యూజిక్ డైరెక్టర్ కెమెరామెన్ ఆర్ట్ డైరెక్టర్ ఇలా ఎంత మంది పని చేసినా కూడా క్రెడిట్ మాత్రం రాజమౌళికి వస్తుంది. అలా రాజమౌళి సినిమాలు ఇంత వరకు గురి తప్పినట్టు హిస్టరీలో లేదు. ఈగతో సినిమా తీసినా, కమెడియన్‌తో మూవీ చేసినా కూడా బ్లాక్ బస్టర్‌ను చేయగల సత్తా ఉన్నోడే రాజమౌళి.

    అలాంటి రాజమౌళిని ముందు చూపుతో పట్టేసుకున్నాడు డీవీవీ దానయ్య. పదమూడేళ్ల క్రితమే రాజమౌళికి దానయ్య అడ్వాన్స్ ఇచ్చాడట. కానీ ఏనాడూ కూడా నాతో ఎప్పుడు సినిమా చేస్తావ్ అని అడగలేదట దానయ్య. దానయ్య పదమూడేళ్ల క్రితమే నాకు అడ్వాన్స్ ఇచ్చారు.. కానీ మధ్యలో ఎన్నో సినిమాలు తీశాను.. ఈగ, మర్యాద రామన్న, బాహుబలి ఇలా సినిమాలు తీశాను.

    కానీ ఏనాడూ కూడా దానయ్య మాత్రం నా సినిమా ఎప్పుడు తీస్తారు అని అడగలేదు.. మీరు ఎప్పుడైనా తీయండి.. ఎప్పుడైనా అవకాశం ఇవ్వండి అనేవారు అంటూ దానయ్య గురించి నిన్నటి చెన్నై ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాజమౌళి చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఆర్ఆర్ఆర్ సినిమాకు నిర్మాత, దర్శకుడు, హీరో అన్నీ కూడా రాజమౌళి అన్న సంగతి తెలిసిందే.

    కానీ ఆర్ఆర్ఆర్ సినిమా వల్ల దానయ్య కంటే ఎక్కువగా రాజమౌళికి ప్రాఫిట్ అయ్యేట్టుంది. ఎందుకంటే రాజమౌళి అండ్ టీం పారితోషికం విలువ అలా ఉందని తెలుస్తోంది. మొత్తం లాభాల్లో నలభై శాతం రాజమౌళికేనట. ఆ లెక్కన నిర్మాత ఖర్చులన్నీ పోను.. మిగిలేది.. రాజమౌళికి వచ్చిందాంట్లో ఎంత ఉంటుందో చూడాలి. దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.

    Leave a Reply