- December 28, 2021
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫోన్ చేశారు.. ‘పుష్ప’ తల్లి ఎమోషనల్ కామెంట్స్

బాహుబలి సినిమాలో కనిపించింది కొద్ది సేపే అయినా తన మార్క్‌ను చూపించారు కల్పలత. ఇక వకీల్ సాబ్‌లో రెండు మూడు చోట్లే కనిపించినా తన ముద్ర వేసింది కల్పలత. కానీ పుష్ప రాజ్ తల్లిగా మాత్రం కల్పలత ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయింది. పుష్పగా బన్నీ ఎంతలా నటించాడో.. అందరూ మాట్లాడుకున్నారు. ఆ తరువాత పుష్ప తల్లి పాత్ర గురించి అంతే గొప్పగా చెప్పుకున్నారు.
కల్పలత పుష్ప సినిమా గురించి చెబుతూ.. అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోల సినిమాలో ఇంత మంచి పాత్ర వస్తుందని కలలో కూడా అనుకోలేదంటూ చెప్పుకొచ్చారు. ఇంత అదృష్టం వస్తుంది, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన నాకు ఇలాంటి అవకాశం వస్తుందని ఎన్నడూ అనుకోలేదంటూ తెలిపారు. అయితే కల్పలత తాజాగా పవన్ కళ్యాణ్ గురించి, ఆయన ఫ్యాన్స్ గురించి ఎంతో గొప్పగా చెప్పారు.
వకీల్ సాబ్ సినిమాలో నేను పవన్ కళ్యాణ్ సర్‌తో నటించాను. ఆయన ఎంతో ఒదిగి ఉంటారు.. ఆయన ఫ్యాన్స్ అయితే నేను సమస్యల్లో ఉన్నప్పుడు అండగా నిలిచారు. మా ఊర్లో నాకు సమస్యలు వచ్చాయి.. ఎవరికి చెప్పుకోవాలో నాకు అర్థం కాలేదు.. అప్పుడు ఫేస్ బుక్‌లో లైవ్ పెట్టాను.. పవన్ సర్ ఫ్యాన్స్ స్పందించారు. కొందరు ఫోన్ చేశారు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి ఫోన్ చేశారు.
మీరు ఊ అంటే వెయ్యి మంది వస్తామని అన్నారు. నా సమస్యను తీర్చారు.. వారి వల్లే మా ఊరు మొత్తం మారిపోయింది అంటూ కల్పలత పవన్ ఫ్యాన్స్ గురించి చెప్పుకొచ్చారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ దారిలోనే ఆయన ఫ్యాన్స్ నడుస్తూ అందరి కష్టాలను తీర్చేస్తుంటారని కల్పలత మాటల్లో అర్థమవుతోంది.