- December 28, 2021
ఓవర్సీస్‌లో టాలీవుడ్ సత్తా.. బాలయ్య, బన్నీ, నాని హవా
అసలే కరోనా దెబ్బకు సినీ ఇండస్ట్రీకి ఈ ఏడాది అంతా కలిసి రాలేదు. మధ్యలో కొంత పరిస్థితి మెరుగైనట్టు అనిపించినా కూడా బాక్సాఫీస్ వద్ద మాత్రం సందడి కనిపించలేదు. అయితే పెద్ద సినిమాలను రిలీజ్ చేసేందుకు చాలా మంది ముందు వెనకా చేశారు. దసరా, దీపావళి బరిలోకి ఎన్నో సినిమాలు ఉండేవి. కానీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు అన్నీ ఎగిరిపోయాయి. అయితే డిసెంబర్ నెల మాత్రం టాలీవుడ్‌కు బాగా కలిసి వచ్చింది.
డిసెంబర్ నెలలో టాలీవుడ్ బాక్సాఫీస్ దుమ్ములేచిపోతోంది. అఖండ సినిమాతో మొదలైన ఈ బాదుడు శ్యామ్ సింగ రాయ్‌తో దూసుకుపోతోంది. నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా మొదలెట్టేసిన ఈ మాస్ జాతర.. ఇప్పటికే కొనసాగుతోంది. ఇక మధ్యలో వచ్చిన పుష్ప అయితే రికార్డ్ కలెక్షన్లను కొల్లగొట్టేస్తోంది. ఇక చివర్లో వచ్చిన నాని మాత్రం సాలిడ్ కలెక్షన్లను రాబట్టేస్తోంది.
ఇక ఓవర్సీస్ ఏరియాల్లో మాత్రం టాలీవుడ్ సత్తాను ప్రపంచానికి చాటుతున్నాం. అఖండ మిలియన్ మార్క్ దాటేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే అఖండకు ఆ మార్క్ దాటేందుకు పది పన్నెండు రోజులు పట్టింది. కానీ పుష్ప అయితే రెండు రోజుల్లోనే వన్ మిలియన్ మార్క్ క్రాస్ చేసింది. ఇప్పుడు రెండు మిలియన్ల మార్క్ దాటేసింది.
ఇక రెండు మూడు రోజుల్లోనే నాని శ్యామ్ సింగ రాయ్ అయితే హాఫ్ మిలియన్ డాలర్లను రాబట్టేసింది. అలా మొత్తానికి ఓవర్సీస్‌లో మన తెలుగు సినిమాలో ఈ ఏడాది చివర్లో కలెక్షన్ల వర్షాన్ని కురిపించాయి. ఈ లెక్కన చూసుకుంటే డిసెంబర్ నెలలో బాక్సాఫీస్ కళకళలాడినట్టే. అయితే ఇప్పుడు ఓమిక్రాన్ భయం పట్టుకుంది. కొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూలు విధించారు. మరి కొన్ని చోట్ల పాక్షిక ఆంక్షలు విధించారు.
ఇంకొన్ని చోట్ల థియేటర్లో యాభై శాతం ఆక్యుపెన్సీకే అనుమతిని ఇచ్చారు. దీంతో రానున్న పెద్ద సినిమాలు గట్టెక్కడం మాత్రం అనుమానంగా మారుతుంది. మొత్తానికి నాని శ్యామ్ సింగ రాయ్, అల్లు అర్జున్ పుష్ప, బాలయ్య అఖండ మాత్రం సేఫ్ జోన్‌లో పడ్డట్టే. ఓవర్సీస్‌లో అయితే ఆల్రెడీ అన్నీ కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయాయని తెలుస్తోంది.
- Tags
- Akhanda
- Akhanda Collection
- Akhanda Overseas Collection
- Akhanda Total Collection
- Akhanda Worldwide Collection
- allu arjun
- Nandamuri Balakrishna
- Nani
- pushpa
- Pushpa Collection
- Pushpa Overseas collection
- Pushpa Total collection
- Pushpa worldwide collection
- Shyam Singha Roy
- Shyam Singha Roy Collection
- Shyam Singha Roy Overseas collection
- Shyam Singha Roy Total collection
- Shyam Singha Roy worldwide collection
- అఖండ
- అల్లు అర్జున్
- నాని
- పుష్ప
- బాలకృష్ణ
- శ్యామ్ సింగ రాయ్