• November 14, 2021

సుందర్ లడ్‌కీ!.. చిరు చిన్నకూతురిపై ప్రీతమ్ జుకల్కర్ కామెంట్స్

సుందర్ లడ్‌కీ!.. చిరు చిన్నకూతురిపై ప్రీతమ్ జుకల్కర్ కామెంట్స్

    సమంత స్టైలిష్ట్, ఫ్యాషన్ డిజైనర్ అయిన ప్రీతమ్ జుకల్కర్ ఈ మధ్య ఫుల్ ట్రెండింగ్‌లో ఉంటున్నాడు. ఇతగాడు అంటూ ఒకడున్నాడని సమంత వల్లే తెలిసింది. ఇతడి ఒల్లో సమంత కాళ్లు పెట్టుకుని అలా పడుకోవడం ఐ లవ్యూలు చెప్పుకోవడం వంటి వాటితో ప్రీతమ్ ఎక్కువగా వార్తల్లోకి వచ్చాడు. అయితే తాజాగా సమంత విడాకుల నేపథ్యంలో ముఖ్యంగా ప్రీతమ్ పేరు ఎక్కువగా వినిపించింది. ప్రీతమ్ వల్లే వ్యవహారం ఇంత దూరం వచ్చిందనే కామెంట్లు వినిపించాయి.

    కొందరైతే ఏకంగా ప్రీతమ్, సమంతల మధ్యే అక్రమ సంబంధాన్ని అంటగట్టేశారు. ఆ రూమర్లపై ప్రీతమ్ చాలా బాధపడ్డాడు. నేను అక్కా అని పిలుస్తాను.. సమంత నాకు సోదరిలాంటిది.. ఈ విషయం చైతూకి కూడా తెలుసు.. కానీ ఇంత మంది ఇన్ని రకాలుగా అంటుంటే.. చై ఖండించకపోవడం చాలా బాధగా ఉందని ఎమోషనల్ అయ్యాడు ప్రీతమ్. మరో వైపు సమంత కూడా రూమర్లను ఖండించింది. నాకు నానా రకాల సంబంధాలను అంటగడుతున్నారు.. ఎఫైర్లున్నాయని అంటున్నారు.. డబ్బు కోసం ఇలా చేశానని అంటున్నారని సమంత సోషల్ మీడియా మీద మండిపడింది.

    అలా మొత్తానికి ప్రీతమ్ మాత్రం నెట్టింట్లో హాట్ టాపిక్ అయ్యాడు. ఇక ముఖ్యంగా శ్రీ రెడ్డి చేసిన గే కామెంట్లు నెట్టింట్లో సంచలనంగా మారాయి. వాటిపై ఎవ్వరూ స్పందించలేదు. ప్రీతమ్ మాత్రం అవన్నీ పట్టించుకోవడం లేదు. తన పని ఏదో తాను చేసుకుంటూ చూసుకుంటూ వెళ్తున్నాడు. ప్రతీమ్ జుకల్కర్‌కు మెగా ఫ్యామిలీతోనూ సంబంధాలున్నాయని అర్థమవుతోంది.

    అల్లు స్నేహారెడ్డికి కూడా ప్రీతమ్ స్టైలీష్ట్‌గా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. దీపావళి దుస్తులను అల్లు స్నేహారెడ్డి కోసం స్పెషల్‌గా డిజైన్ చేసి ఇచ్చాడు. ఇక తాజాగా శ్రీజ ఫోటోకు కామెంట్ చేశాడు. సుందర్ లడ్‌కీ అంటూ చిరు చిన్నకూతురి మీద కామెంట్ చేశాడు. మొత్తానికి ప్రీతమ్‌కు ఇండస్ట్రీలో చాలా మందితోనే సన్నిహిత సంబంధాలున్నాయన్న మాట.

     

    Leave a Reply