• November 16, 2021

Bigg Boss 5 Telugu : ఒక్క మాటలో తేల్చి పడేశాడు.. ప్రియాంక గుట్టు విప్పిన విశ్వ

Bigg Boss 5 Telugu : ఒక్క మాటలో తేల్చి పడేశాడు.. ప్రియాంక గుట్టు విప్పిన విశ్వ

    బిగ్ బాస్ ఇంటి నుంచి విశ్వ బయటకు వచ్చేశాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన విశ్వ ఎలిమినేట్ అవ్వడంతో అంతా షాక్ అయ్యారు. కానీ ప్రేక్షకుల తీర్పు అలానే వచ్చింది. బిగ్ బాస్ ఇంట్లో ఉండి వచ్చిన విశ్వకు అక్కడి కంటెస్టెంట్ల గురించి ఎక్కువగా తెలుస్తుంది. మనం చూసేది గంట మాత్రమే. కానీ బిగ్ బాస్ ఇంట్లో వాళ్లు 24 గంటలు ఉంటారు. ఒకరినొకరు పరీక్షించుకుంటూ ఉంటారు. అయితే తాజాగా విశ్వ బిగ్ బాస్ కంటెస్టెంట్ల మీద కామెంట్ చేశాడు.

    తాజాగా తన ఫ్యాన్స్‌తో ఇన్ స్టాగ్రాంలో చిట్ చాట్ చేశాడు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. ఇందులో భాగంగా నెటిజన్లు హమీద, శ్వేతా వర్మ, శ్రీరామచంద్ర, లోబోల గురించి ప్రశ్నలు సంధించారు. హమీద, శ్వేతా చాలా మంచి వారని అన్నాడు. బిగ్ బాస్ ఇంట్లో లోబో తనకు బెస్ట్ ఫ్రెండ్ అని తెలిపాడు. ఇక శ్రీరామచంద్ర ఎంతో మంచి వాడు..అతడిని నేను మిస్ అవుతున్నాను అంటూ విశ్వ చెప్పుకొచ్చాడు.

    ఇక కానీ ప్రియాంక గురించి మాత్రం చిత్రమైన కామెంట్ చేశాడు. పింకీ గురించి ఒక్క పదంలో చెప్పండి అని ఓ నెటిజన్ అడిగాడు. ఫేక్ అంటూ ఒకే ఒక్క పదంలో ఆమె గురించి తేల్చిపడేశాడు. అయితే ప్రియాంకను మనం ఇన్ని రోజులు చూస్తున్నది ఫేక్? అని నెటిజన్లు ఆశ్చర్యపోతోన్నారు. అయితే ఆమె ఇంట్లో ఉండి చేస్తుంది కూడా కొత్తగా ఏమీ లేదు. మానస్ మీద పడి ముద్దులు పెట్టడం తప్పా ప్రియాంక ఏమీ చేయడం లేదు. ఈ వారం ప్రియాంక ఎలిమినేట్ అవ్వడం ఖాయమనిపిస్తోంది.

    Leave a Reply