- November 16, 2021
తమన్‌ను బాధపెట్టిన నాని!.. శివ నిర్వాణ అంత మోసం చేశాడా?

శివ నిర్వాణ సినిమాలకు తమన్, గోపీ సుందర్ ఇద్దరూ పని చేశారు. నిన్ను కోరి సినిమాకు గోపీ సుందర్ సంగీత దర్శకుడు. మజిలీ చిత్రానికి తమన్ మ్యూజిక్ డైరెక్టర్. అయితే శివ నిర్వాణ తెరకెక్కించిన టక్ జగదీష్ సినిమాకు తమన్ సంగీత దర్శకుడు. గోపీ సుందర్ నేపథ్య సంగీత దర్శకుడు. ఈ విషయంలో ఏమైనా విబేధాలు వచ్చాయా? అని ఆ మధ్య డైరెక్టర్ శివ నిర్వాణ మాత్రం అలాంటిదేమీ లేదని చెప్పాడు. కానీ అది తప్పు.. వెనకాలా చాలానే జరిగిందని తెలుస్తోంది.
అంటే శివ నిర్వాణ అబద్దాలు చెప్పాడా? మోసం చేశాడా? అని అందరూ అనుకుంటున్నారు. టక్ జగదీష్ కోసం తమన్ చాలానే కష్టపడ్డాడట. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పూర్తి చేసేశాడట. అయితే మన హీరో నాని గారికి నచ్చలేదుట. దీంతో అలా ఇద్దరు సంగీత దర్శకులయ్యారు. తాజాగా దీని గురించి తమన్ నోరు విప్పేశాడు. మామూలుగా అయితే ఇలాంటివి తమన్ పట్టించుకోడు. కానీ కాస్త హర్ట్ అయినట్టు కనిపిస్తోంది. అందుకే ఇలా ఓ మీడియాతో తన బాధను వెల్లగక్కినట్టు కనిపిస్తోంది.
టక్ జగదీశ్ విషయంలో చాలా బాధపడ్డానని ఎట్టకేలకు అసలు విషయం చెప్పాడు. ఆ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మొత్తం పూర్తిచేశాననీ, కానీ నానికి నచ్చలేదని తెలిపాడు తమన్. నా లైఫ్ లో అలా జరగడం ఫస్ట్ టైమ్ అని బాధపడ్డాడు. నానితో వర్క్ చేయడం చాలా బాగా అనిపించింది.. మనసు పెట్టి పనిచేశాను అని తన పని తనం గురించి చెప్పాడు. సినిమా మొత్తానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పూర్తిచేశాను.. కానీ నానికి నచ్చలేదు అని అన్నాడు. ఇంకా బెటర్‌గా కోరుకున్నాడు.. తర్వాత గోపీసుందర్‌తో చేయించుకున్నారు అంటూ అసలు సంగతిని బయటపెట్టేశాడు.