• November 16, 2021

Bigg Boss 5 Telugu : బాత్రూంలోకి వెళ్లి డోర్ వేసుకున్న సిరి.. ఆందోళనలో కంటెస్టెంట్లు

Bigg Boss 5 Telugu : బాత్రూంలోకి వెళ్లి డోర్ వేసుకున్న సిరి.. ఆందోళనలో కంటెస్టెంట్లు

    బిగ్ బాస్ ఇంట్లో మంగళవారం నాటి ఎపిసోడ్‌లో ఏదో పెద్ద అలజడే జరిగేట్టు కనిపిస్తోంది. బంగారం వేట అంటూ ఈ వారం కెప్టెన్సీ టాస్కును ఆడిస్తున్నాడు. ఎవరి బంగారం వారే వెతుక్కోవాలి.. కాపాడుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ టాస్కులో సిరి, షన్ను మళ్లీ మాటలు అనుకున్నట్టు కనిపిస్తోంది. ఏం జరిగిందనే దానిపై స్పష్టత రావడం లేదు. కానీ తాజాగా వదిలిన ప్రోమోలో మాత్రం కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి.
    సిరి, షన్ను మాటామాట అనుకున్నారు.

    నీ గేమ్ నువ్ ఆడుకో.. నాతో ఉండకు వెళ్లు అంటూ సిరిని దూరంపెట్టే ప్రయత్నం చేశాడు షన్ను. నాకు ఇక్కడ ఉండాలని అనిపించడంలేదు.. ఒంటరినన్న ఫీలింగ్ వస్తోంది.. తను(దీప్తి) ఇక్కడ ఉంటే బాగుండు అని అనుకుంటూ బాధపడ్డాడు. ఇంకో నాలుగు వారాలే కదా? వెళ్దువులే అని సిరి ఓదార్చే ప్రయత్నం చేసింది. నువ్ నాకేం చెప్పాల్సిన పని లేదు.. ఎప్పుడు వెళ్లాలో.. ఏం చేయాలో నాకు తెలుసు.. నువ్ ఇక్కడి నుంచి వెళ్లిపో అంటాడు.

    బాత్రూం ఏరియాలో ఈ ఇద్దరూ పెట్టుకున్న ముచ్చట్లు, గొడవలు ఎటో మలుపు తిరిగేట్టు కనిపిస్తోంది. అలా షన్ను తనను వెళ్లిపో అనడంతో.. బాత్రూంలోకి వెళ్లి డోర్ వేసుకుంది సిరి. అయితే ఏ పిచ్చి పని చేస్తుందో అని షన్ను కంగారు పడ్డట్టున్నాడు. ఎంత పిలిచినా డోర్ తీయలేదు. దీంతో రవి మిగతా కంటెస్టెంట్లంతా వచ్చి బాత్రూం డోర్‌ను టపాటపా బాదేశారు. మరి సిరి నిజంగానే ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందా? అసలు ఏం జరుగబోతోందని అందరూ ఆందోళన చెందుతున్నారు.

    Leave a Reply