• November 5, 2021

Bigg Boss 5 Telugu : అర్దరాత్రి అలా ఉదయం ఇలా.. సిరి, షన్ను వ్యవహారం వేరే లెవెల్

Bigg Boss 5 Telugu : అర్దరాత్రి అలా ఉదయం ఇలా.. సిరి, షన్ను వ్యవహారం వేరే లెవెల్

    Bigg Boss 5 Telugu బిగ్ బాస్ ఇంట్లో గురువారం రచ్చ రచ్చగా మారింది. అంతా గొడవలతోనే సాగింది. మొత్తానికి ఎక్కువగా అంటే సిరి, షన్నుల మధ్య దూరం పెరిగింది. విశ్వ, మానస్‌ల మధ్య కూడా గొడవ జరిగింది. షన్ను, సన్నీల మధ్య కాస్త వాగ్వాదం జరిగింది. అలా ఇంట్లో చాలా మంది మధ్య గొడవలు జరిగాయి. అయితే సిరి, షన్నుల వ్యవహారం మాత్రం ఎవ్వరికీ అంతు పట్టడం లేదు. ఒకసారి గొడవలు పడతారు. వెంటనే కలిసిపోతారు. మళ్లీ గొడవలు పడుతుంటారు.

    సంచాలక్, కెప్టెన్ బాధ్యతలను నిర్వర్తిస్తోన్న షన్ను మీద సిరి, జెస్సీలు కాస్త కోపంగానే ఉన్నారు. తననే కావాలని టార్గెట్ చేస్తున్నాడని, అందరి ముందు తన మీదే అరిచేస్తున్నాడంటూ షన్ను మీద సిరి కామెంట్ చేసింది. దానికి సారి చెబుతూ గుంజిళ్లు కూడా తీశాడు షన్ను. అర్దరాత్రి సారీ సారి అని చెబుతూ తిరిగింది. అందరి ముందు సారి అని చెప్పాడు షన్ను. చివరకు అర్దరాత్రి గట్టిగా హగ్ ఇచ్చేసింది సిరి. దీంతో గొడవ ముగిసిందని అంతా అనుకుంటారు.

    కానీ ఉదయం మళ్లీ టాస్క్ మొదలవ్వడంతో గొడవ కూడా ప్రారంభం అయింది. షన్ను చేసిది నాకు నచ్చడం లేదంటూ సిరి, జెస్సీ మాట్లాకున్నారు. నచ్చకపోతే నామినేట్ చేసుకోండి.. కానీ నేను మాత్రం ఇలానే ఉంటాను, కెప్టెన్, సంచాలక్‌గా నా పని నేను చేస్తాను అని అన్నాడు. ఎవరి ఆట వారు ఆడుకుంటే బాగుంటుందని సిరి, షన్నులు ఒకరిపై ఒకరు అరుచుకున్నారు.

    ఇక ఇంటి సభ్యుల బట్టలన్నీ తీసి అవతల పారేసింది సిరి. విలన్ టాస్కులో భాగంగా ఇలా చేసి ఉంటుందేమో. అయితే సిరి అలా చేయడం, అందరి లో దుస్తులు తీసి అలా పారేయడంపై షన్ను సీరియస్ అయ్యాడు. అవన్నీ మడతపెట్టుపో అని సిరికి ఆర్డర్ వేశాడు కెప్టెన్‌గా షన్ను. తరువాత పెడతాను అని చెప్పింది. చివరకు విసుగొచ్చిన సిరి.. నేను మడతపెట్టను అని

    ఇదే నీ కారెక్టర్ అని సిరిని దారుణంగా అనేశాడు షన్ను. ఆ మాటలకు సిరి ఏడ్చేసింది. ఇలా ఇన్ని తిట్టేసిన షన్ను.. చివరకు సిరి చాలా స్ట్రాంగ్, బీభత్సమైన రాడ్ నెక్ట్స్ నుంచి నా టీంలోనే ఉంచుకుంటాను అని కాజల్‌తో అంటాడు షన్ను. నేటి ఎపిసోడ్‌లో ఈ ఇద్దరి మధ్య ఇంకా దూరం పెరిగేలా ఉంది. ఫేక్ ఫేక్ అంటూ షన్నును పదే పదే సిరి అంటుంది. ఒంటరిగా కూర్చుని సిరి ఏడ్చేసింది. ఈ రోజు ఏం జరుగనుందో చూడాలి.

     

     

    Leave a Reply