• November 14, 2021

‘రక్షకుడు’ రిజల్ట్ ఏంటో తెలుసు కదా?.. తన పరువుతానే తీసుకున్న నాగార్జున!

‘రక్షకుడు’ రిజల్ట్ ఏంటో తెలుసు కదా?.. తన పరువుతానే తీసుకున్న నాగార్జున!

    నాగార్జున తన సినిమా కెరీర్‌లో ఎన్ని ప్రయోగాలు చేశాడో అందరికీ తెలిసిందే. కొత్త కొత్త టెక్నీషియన్లను తీసుకురావడమే కాకుండా ఉత్తరాది భామలను తన సినిమాల్లో పెట్టుకునే వాడు. అలా నాగార్జున తన సినిమాల్లో ఎన్నో విభిన్నత్వాన్ని చూపించేవాడు. అలా రక్షకుడు అనే సినిమాతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అప్పటి వరకు ఆ సినిమా ఒక లెక్కన పాన్ ఇండియన్ అని అనుకోవాలి. కానీ ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం బోల్తా కొట్టేసింది.

    సుష్మితా సేన్ హీరోయిన్.. ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ ఇలా ఎన్నెన్నో హంగులతో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ అయింది. నాగార్జునకు వీరావేశం, కోపం రావడం, నరాలు బయటకు వచ్చినట్టు.. అలా పాక్కుంటూ ఒళ్లంతా వెళ్లడం అనే సీన్లు అప్పట్లో ఫుల్ ఫేమస్. ఇక కోపం వచ్చిందంటే అందరికీ అలానే నరాలు బయటకు రావాలనేంతగా ముద్ర పడింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఫలితం, సినిమా గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందో ఓ సారి చూద్దాం.

    నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్‌లో సన్నీ తన వీరావేశాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను సర్. కానీ కంట్రోల్ అవ్వడం లేదు.. అంతా మీ ఇన్‌స్పిరేషన్.. మీ రక్షకుడు సినిమా చూసే ఇలా అయ్యానంటూ సన్నీ కామెంట్ చేశాడు. రక్షకుడు రిజల్ట్ ఏంటో తెలుసు కదా? అని తన సినిమా తానే కౌంటర్ వేసుకున్నాడు నాగార్జున. అలా నాగ్ అనడంతో అందరూ షాక్ అయ్యారు. దెబ్బకు సన్నీ నోర్మూసుకున్నాడు.

    Leave a Reply