- January 13, 2022
సమంతను ఫాలో అవుతున్న దీప్తి సునయన!.. అందుకే ఆ పోస్ట్ చేసిందా?

Samantha Ruth Prabhu ప్రస్తుతం సమంతను దీప్తి సునయన ఫాలో అవుతున్నట్టు అనిపిస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్యతో విడాకులు తీసుకుని సమంత దూరంగా ఉంటోంది. ఇక ప్రేమించిన వాడితో బ్రేకప్ చెప్పి దూరంగా ఉంటోంది దీప్తి సునయన. ఒక రకంగా చూస్తుంటే కాస్త ఇద్దరి పరిస్థితులు ఒకేలా ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకే సమంత షేర్ చేసిన ఓ పోస్ట్‌ను దీప్తి సునయన కూడా షేర్ చేసింది.
సమంత తన ఇన్ స్టా స్టోరీలో ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో ఓ ప్రొఫెసర్ తన స్టూడెంట్లకు వాటర్ ఉన్న గ్లాసును చూపిస్తాడు. అందులో ఎంత వాటర్ ఉందని అడుగుతారు. ఒక్కొక్కరు కొన్ని ఔన్సుల విలువ చెబుతారు. అసలు ఇందులో ఎంత వాటర్ ఉన్నది అనేది ముఖ్యం కాదు.. దాన్ని మనం ఎంత సేపు అలా పట్టుకుని ఉంటే మనకు అంత నొప్పి వేస్తోంది.
జీవితంలో సమస్య, బాధలు, కోపం, ఒత్తిడి ఇలాంటివి కూడా అంతే. మనం వాటిని ఎంతగా మోస్తుంటామో.. మన మనసు కూడా అంతే బరువెక్కిపొతోంది. వాటిని తీసి పక్కన పెట్టేయాలనే నీతి సూత్రాన్ని వివరించాడు. ఇదే పోస్ట్‌ను సమంత షేర్ చేయగా.. దీప్తి సునయన కూడా తన ఇన్ స్టా స్టోరీలో పెట్టేసుకుంది. మొత్తానికి దీప్తి సునయన కూడా ఇప్పుడు షన్ను గుర్తులను అలానే తీసి పక్కన పెట్టేసి తన కెరీర్ మీద ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తోంది.
షన్ను దీపు బ్రేకప్‌కు బిగ్ బాస్ షోనే కారణమైంది. ఆ షోలో సిరితో షన్ను కాస్త ట్రాక్ తప్పాడనే అనిపిస్తుంది. హద్దులు దాటి ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయారు. ఫ్రెండ్ షిప్ కంటే కాస్త ఎక్కువే మెయింటైన్ చేశారు. అందుకే షన్ను పట్ల దీప్తి సునయన ఆగ్రహంగా ఉన్నట్టుంది. ఇక వారి రిలేషన్ సంగతి తెలిసే దీప్తి ఇలా పక్కకు తప్పుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.