• November 13, 2021

Bigg Boss 5 Telugu : అందరూ పిచ్చి కుక్కల్లా అరిచేశారు.. ఏ ఒక్కరూ తగ్గట్లే

Bigg Boss 5 Telugu : అందరూ పిచ్చి కుక్కల్లా అరిచేశారు.. ఏ ఒక్కరూ తగ్గట్లే

    బిగ్ బాస్ ఇంట్లో పదోవారం రచ్చ రచ్చగా మారింది. కెప్టెన్సీ టాస్కులో మాత్రం ఇళ్లు పీకి పందిరేసినంత పని చేశారు. గొడవల మీద గొడవలు.. ఒకరిని మించి మరొకరు అరిచేశారు.. తమ మాటల దాడిని మొదలుపెట్టేశారు. సిరి, షన్ను, సన్నీ, కాజల్, ఆనీ ఇలా అందరూ పిచ్చి కుక్కల్లా వాగేశారు. ఎవరిది తప్పు ఏంటి? అనేది కూడా చెప్పేందుకు వీల్లేకుండాపోయింది. సన్నీ ఇష్టమొచ్చినట్టుగా మాటలు వదిలేశాడు. సిరి ఇంకా రెచ్చగొట్టడం ప్రారంభించింది. దానికి తోడు షన్ను మాటలు, యాక్షన్లు కూడా తోడయ్యాయి.

    అసలే కంట్రోల్‌లో ఉండని సన్నీ.. పూర్తిగా తనను తాను కోల్పోయాడు. అప్పడం అవుద్ది..తంతా.. రా రా.. ఏంట్రా.. ఇలా ఎన్నోన్నో మాటలు వదిలేశాడు. చివరకు షన్ను వీరావేశంగా ఊగిపోయి డైలాగ్‌లు వదిలితే.. దాన్నికూడా వెక్కిరించేశాడు సన్నీ. నువ్ యూట్యూబ్ వరకు అంటూ దారుణంగా అవమానించేశాడు. సిరి అయితే ఇక సన్నీని ఇంకా రెచ్చగొట్టేందుకు ప్రయత్నించింది. ఆడదాన్ని అడ్డం పెట్టుకుని అంటున్నావ్.. నీ సైడ్ ఇద్దరు ఆడవాళ్లున్నారు అని మేం అన్నామా? కోపాన్ని ఎందుకు కంట్రోల్ చేసుకుంటున్నావ్.. బయటకు తీయ్ అంటూ ఇంకా రెచ్చగొట్టేసింది సిరి.

    వారి గొడవలు అలా ఉంటే.. కాజల్, ఆనీ మాస్టర్లవి ఇంకా వేరే లెవెల్. అసలు ఇదంతా జరగడానికి మూలం కాజల్. ఆనీ మాస్టర్‌ను వచ్చి చెక్కిలి గింతలు పెట్టేసింది కాజల్. అది చూసి సన్నీని పట్టుకుంది సిరి. దాంతో గొడవ మొదలైంది. ఆనీ మాస్టర్, కాజల్ అరుచుకోవడం, మాట్లాడుకోవడం చూస్తుంటే ఇద్దరినీ తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్ పడేస్తే బెటర్ అన్న ఫీలింగ్ వస్తుంది. వికృతమైన నవ్వులతో కాజల్ రెచ్చగొట్టడం, ఆనీ మాస్టర్ ఒళ్లు మరిచిపోయి పిచ్చి పిచ్చి గెంతులు వేయడం ఏంటో ఆమెకే తెలియాలి. మొత్తానికి ఇళ్లంతా నానా గందరగోళంగా మారింది. చివరకు రవి కెప్టెన్ అయ్యాడు.

    Leave a Reply