- October 22, 2021
అమెజాన్ యూజర్లకు షాక్.. పెరగనున్న ధరలు

ప్రస్తుతం ఓటీటీల హవా, ఆన్ లైన్ షాపింగ్ల ఊపు ఎలా ఉందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా కరోనా సమయంలో అందరూ ఓటీటీ మీదే ఆధారపడ్డారు. ఓటీటీలో ఇంటర్నేషనల్ కంటెంట్ చూసుకుంటూ కాలాన్ని గడిపారు. ఇక మన తెలుగు సినిమాలు కూడా ఓటీటీ బాట పట్టాయి. కానీ అందులో మన చిత్రాలు దెబ్బ తిన్నాయి. అయితే ఇప్పుడు అమెజాన్ అందరికీ షాక్ ఇవ్వబోతోంది. ముఖ్యంగా దాన్ని వాడే యూజర్లు నిజంగా ఖంగుతింటారు.
అమెజాన్ వార్షిక సబ్ స్క్రిప్షన్, త్రైమాసిక సబ్ స్క్రిప్షన్ రేట్లను పెంచబోతోందట. ఈ మేరకు ఓ ప్రకటన వచ్చింది. కానీ ఎప్పటి నుంచి ఆ ధరలు అందుబాటులోకి వస్తాయన్నది ఇంకా స్పష్టం చేయలేదు. అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ తీసుకుంటే.. ప్రైమ్ వీడియోలు, మ్యూజిక్, ఉచిత హోం డెలీవరి వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. దీని ధర ఇప్పటి వరకు రూ.999 ఉంది. కానీ ఇకపై అది దాదాపు రూ.1499కి కానుందట.
అలానే మూడు నెలలకు గాను ఇప్పటి వరకు రూ. 329 వసూళ్లు చేసేది. కానీ ఇకపై అది రూ. 459 కానుందట. నెలకు రూ.129 ఉండేది.. కానీ ఇకపై అది రూ.179 కానుందని తెలుస్తోంది. మొత్తానికి అమెజాన్ తన డిమాండ్‌ను ఇలా క్యాష్ చేసుకుంటోంది.