• November 18, 2021

ఇండస్ట్రీకి చిరంజీవి మూడో కన్ను.. వెంకయ్య నాయుడు మాటలు కొందరికి చెంపపెట్టు!

ఇండస్ట్రీకి చిరంజీవి మూడో కన్ను.. వెంకయ్య నాయుడు మాటలు కొందరికి చెంపపెట్టు!

    మెగాస్టార్ చిరంజీవి గురించి ఎందరో ఎన్నెన్నో మాటలు అంటారు. చిరంజీవి గురించి తెలిసిన వారు.. దేవుడని అంటారు. అందరివాడు అని అంటారు. ఆపద్భాంధవుడని ఆరాధిస్తారు. కొందరు మాత్రం చిరంజీవిని కావాలని పదే పదే కింద లాగాలని చూస్తుంటారు. చిరు మీద అవాకులు చెవాకులు పేలుతుంటారు. మొన్నటి మా ఎన్నికల్లోనూ ఇలాంటి కొన్ని పరోక్ష కామెంట్లు వచ్చాయి. అయితే భారత దేశానికి ద్వితీయ పౌరుడు, ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్య నాయుడు చిరంజీవి గురించి ఎంతో గొప్పగా చెప్పారు.

    బుధవారం నాడు యోధ లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రసంగించారు. ప్రసంగం ప్రారంభంలోనే చిరంజీవి గురించి, ఆయన గొప్పదనం గురించి మాట్లాడారు. చిరంజీవి గారిని ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్నాను.. ఎన్నో సార్లు ఇది వరకే చెప్పాను.. చిరంజీవి గారు తెలుగు చిత్రసీమ, కళామతల్లిమూడో కన్ను. మూడో కన్ను అని ఎందుకు అన్నానంటే.. మొదటి కన్ను ఎన్టీఆర్,రెండో కన్ను ఏఎన్నారో.

    ఆ తరువాత అంతటిస్థాయిలో పది కాలాల పాటు గుర్తు పెట్టుకోగల నటుడిగా శ్రీ చిరంజీవి గారు ఎదిగారు.ఇంకా నటిస్తున్నారు అని అన్నారు. అలా చిరంజీవి గొప్ప దనం గురించి చెప్పడానికి ఇంతకంటే మంచి పోలిక ఉండదు. ఇప్పటికైనా కొందరికి చిరంజీవి గొప్పదనం తెలిస్తే మంచిదని అభిమానులు కోరుకుంటున్నారు.

    మా ఎన్నికల సమయంలో ఇండస్ట్రీకి పెద్ద అంటూ వివాదాస్పద అంశాలను లేవనెత్తారు. మోహన్ బాబును ఇండస్ట్రీకి పెద్దగా ఉండాలని నరేష్ లేవెత్తిన అంశం ఎంతటి వివాదాస్పదానికి దారి తీసింది. చిరంజీవిపై ఆ సమయంలో కొందరు పరోక్షంగా కామెంట్లు చేయడంపై ఇండస్ట్రీలో చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తోంది.

    Leave a Reply