• November 17, 2021

Bigg Boss 5 Telugu : ఇకపై ఒకే బెడ్డు మీద పడుకోవడం వద్దు!.. ఇప్పటికి షన్నుకి బుద్ది వచ్చిందా?

Bigg Boss 5 Telugu : ఇకపై ఒకే బెడ్డు మీద పడుకోవడం వద్దు!.. ఇప్పటికి షన్నుకి బుద్ది వచ్చిందా?

    బిగ్ బాస్ ఇంట్లో కొన్ని వ్యవహారాలు తప్పుగా అనిపించకపోవచ్చు. కానీ చూసే జనాలకు మాత్రం చాలా తప్పుగా అనిపిస్తాయి. పదే పదే హగ్గులు, ముద్దులు పెట్టుకుంటూ ఉంటే చూసే జనాల్లో ఒక రకమైన ముద్ర పడుతుంది. వారి సింగిల్ అయి ఉంటే ఏదో ట్రాక్ నడుపుతున్నారు. ఇష్టపడ్డారేమో అందుకే అలా చేస్తున్నారని లైట్ తీసుకుంటారు. కానీ బయట వారు రిలేషన్‌లో కమిట్ అయి ఉండటం, లవర్లు ఉండటం.. లోపల మాత్రం ఇంకో ట్రాక్ నడపడంతోనే అసలు సమస్య వస్తుంది.

    షన్ను లవ్ స్టోరీ, సిరి ప్రేమ కథ అందరికీ తెలిసిందే. షన్ను కోసం బయట దీప్తి, సిరి కోసం శ్రీహాన్ కష్టపడుతున్నారు. కానీ లోపల మాత్రం సిరి, షన్నులు సరసాలు ఆడుకుంటున్నారు. ఇన్ని రోజులు చేసింది ఒకెత్తు. ఇకపై ఒకెత్తు అంటూ సిరితో షన్ను మాట్లాడాడు. 19 మంది ఉన్నప్పుడు మనపై అంత ఫోకస్ ఉండకపోవచ్చు. కానీ ఇంట్లో జనాలు తగ్గిపోయారు మన మీద ఎక్కువ ఫోకస్ ఉంటుందేమో.. మనం చిన్నతప్పు చేయడం వల్ల ఎంతో కోల్పోతాం.

    ఇంకా మనం ఒకే బెడ్డు మీద పడుకుంటే.. చూసే వాళ్లు ఏదైనా తప్పుగా అనుకుంటారు. ఇక మనం అలా పడుకోవద్దు.. ఓకేనా? అంటూ సిరికి సముదాయించి చెబుతాడు షన్ను. ఇలా ఇప్పటికి వీరికి బుద్ది వచ్చినట్టుంది. మొదటి నుంచి కూడా అలానే ఉంటే పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదు. షన్ను మధ్యలో అటు వైపు జెస్సీ ఇటు వైపు సిరి ఒకే బెడ్డు మీద పడుకునే వారు. ఆ మధ్య ఈ విషయం కూడా ఎక్కువగా ట్రోల్ అయింది. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్‌తో షన్ను, సిరిలు దారుణంగా బ్యాడ్ అయిపోయారు.

    షన్ను శాడిజం, ఇన్ సెక్యురిటీని ఎలా భరిస్తున్నావ్ అని దీప్తి సునయన మీద జాలి పడ్డారు నెటిజన్లు. ఇక ఇలాంటి దాన్ని ఇంత వరకు చూడలేందంటూ సిరి కారెక్టర్ మీద దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తానికి రాను రాను పరిస్థితులు ఇంకా మారేట్టు కనిపిస్తోంది. ఇలానే చేస్తే సిరి ఎలిమినేట్ అయ్యే చాన్సులు ఎక్కువగా ఉన్నాయి. షన్ను కూడా విన్నింగ్ చాన్స్ కోల్పోయేలా ఉన్నాడు.

    Leave a Reply