- November 17, 2021
కేటీఆర్‌పై సమంత ప్రశంసలు.. ఆ పని చేయడంతో పొగడ్తలు

సమంత ఈ మధ్య ప్రతీ అంశం మీద స్పందిస్తోంది. ఇంతకు ముందే కంటే ఎక్కువగా బిజీ అవుతోంది. సినిమా సామాజిక ఆధ్యాత్మిక అంశాల మీద ఎక్కువగా స్పందిస్తోంది. ఉత్తరాధిపై ఎక్కువగా ఫోకస్ పెట్టిన సమంత.. ఇప్పుడు ఫ్యామిలీ మెన్ సీజన్ 2 ఫీవర్లో ఉంది. ఫిల్మ్ కాంపానియన్ అనే సంస్థ సమంతను ఆకాశానికెత్తడం, సమంత కూడా ఉప్పొంగిపోవడం అందరికీ తెలిసిందే. ఇక తాజాగా పుష్ప సినిమాలోనూ ఓ స్పెషల్ సాంగ్‌కు సమంత ఓకే చెప్పింది.
ఇలాంటి నిర్ణయాలతోనే సమంతను చూసి అంతా షాక్ అవుతున్నారు. తాజాగా సమంత ఓ పోస్ట్ చేసింది. కేటీఆర్‌ను ప్రశంసింది. మంత్రి సత్యవతి రాథోడ్ తీసుకున్న నిర్ణయాన్ని హర్షించింది. అలా మొత్తానికి సమంత రాజకీయ అంశాల మీద కూడా ఫోకస్ పెట్టేసింది. అసలు సమంత ఏ విషయం మీద స్పందించిందో ఓ సారి చూద్దాం. రెండ్రోజుల క్రితం మంత్రి సత్యవతి రాథోడ్ పిల్లల కోసం స్పెషల్ అంబులెన్స్‌లను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
మంత్రి ప్రారంభించిన బాల రక్షక్ వెహికల్స్ మీద కేటీఆర్ స్పందించాడు. ఇది చాల గొప్ప నిర్ణయం. దీన్ని ముందుకు తీసుకొచ్చిన మంత్రి సత్యవతి రాథోడ్‌కు థ్యాంక్స్. అలానే కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద సాయం చేసిన కంపెనీలకు కూడా థ్యాంక్స్ అని కేటీఆర్ అన్నాడు. ఇక కేటీఆర్ చేసిన ఈ పోస్ట్ మీద సమంత స్పందించింది.
33 బాల రక్షక్ వెహికల్స్ ప్రారంభించారు.. 1098 అనేది హెల్ప్ లైన్.. ఏ పిల్లలైనా సరే ప్రమాదంలో ఉన్నారని తెలిస్తే ఆనంబర్‌కు ఫోన్ చేయవచ్చు.. అంటూ దండం పెడుతూ క్లాప్స్ కొట్టిన ఎమోజీలను షేర్ చేసింది. మొత్తానికి సమంత ఇలా సామాజిక విషయాల మీద కూడా బాగానే స్పందిస్తోంది. సమంత చేతిలో ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్‌లున్నాయన్న సంగతి తెలిసిందే. అవి రెండూ కూడా తెలుగు, తమిళ ద్విభాష చిత్రాలే.