• November 1, 2021

Bigg Boss 5 Telugu : నామినేషన్ లిస్ట్.. ఇంటి సభ్యులందరికీ షాక్

Bigg Boss 5 Telugu : నామినేషన్ లిస్ట్.. ఇంటి సభ్యులందరికీ షాక్

    బిగ్ బాస్ ఇంట్లో ఇప్పుడు కేవలం 11 మందే ఉన్నారు. అయితే గడిచిన ఎనిమిది వారాల్లో ఒక్కో వారం చొప్పున ఎనిమిది మంది కంటెస్టెంట్లు బయటకు వెళ్లిపోయారు. దీపావళి సెలెబ్రేషన్స్ అంటూ నిన్న అంతా హంగామా జరిగింది. సెలెబ్రిటీలు వచ్చారు.. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు వచ్చారు.. యాంకర్ సుమ వచ్చి అందరినీ ఆడించింది. సింగర్ కల్పన వచ్చి అందరి గురించి పేరడీ పాటలు పాడింది. అలా ఆది వారం ఎపిసోడ్ అంతా సందడిగా గడిచింది.

    కానీ చివరకు మాత్రం లోబో ఎలిమినేషన్ యథాతథంగా జరిగింది. లోబో బయటకు వెళ్లడంతో ఇంట్లో 11 మందే ఉన్నారు. సిరి, షన్ను, జెస్సీ, కాజల్, మానస్, సన్నీ, ప్రియాంక, ఆనీ, రవి, విశ్వ, శ్రీరామచంద్రలు బిగ్ బాస్ ఇంట్లో ఇప్పుడు ఉన్నారు. ఇక తొమ్మిదో వారంలో జరిగే నామినేషన్ ప్రక్రియ మంచి రంజు మీదున్నట్టు కనిపిస్తోంది. ఐస్ క్రీం పూస్తూ నామినేషన్లు వేయాలని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. మొత్తానికి బిగ్ బాస్ ఇంట్లో అందరికీ కూడా షాక్ తగిలినట్టు కనిపిస్తోంది.

    ఒక్క కెప్టెన్ షన్ను తప్ప మిగిలిన అందరూ కూడా నామినేట్ అయినట్టు కనిపిస్తోంది. ఆ లెక్క ఈ తొమ్మిది వారంలో పది మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. అంటే ఈ సారి ఏమైనా డబుల్ ఎలిమినేషన్ ఉండబోతోందా? లేదైనా ఏదైనా ట్విస్ట్ ఇస్తాడా? అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి పది మంది నామినేట్ అయ్యారని తెలిస్తే ఇంటి సభ్యులు ఎలా షాక్ అవుతారో చూడాలి. మొత్తానికి బిగ్ బాస్ షో తొమ్మిదో వారంలోకి అడుగు పెట్టేసింది.

    Leave a Reply