- October 23, 2021
Puri Jagannadh: ఛార్మీయే నా బలం.. పూరి జగన్నాథ్ కామెంట్స్ వైరల్

Puri Jagannadh ఛార్మీ, పూరి జగన్నాథ్ గురించి ఇండస్ట్రీలో వినిపించే టాక్ గురించి అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారని, పూరి తన భార్య లావణ్యకు దూరంగా ఉంటున్నాడని అంతా మాట్లాడుకుంటూ ఉంటారు. అందుకే ఎక్కువగా పూరి, ఛార్మీలు ముంబైలోని కొత్త ఆఫీస్‌కు మకాం మార్చేశారని టాక్. ఇక్కడ హైద్రాబాద్‌లో ఆయన ఫ్యామిలీ మాత్రమే ఉంటుంది. అక్కడ మాత్రం పూరి, ఛార్మీలు ఉంటారు.
ఇక ఛార్మీ అంటే తనకు ఎంత స్పెషల్ అనేది పూరి జగన్నాథ్ మరో సారి నిరూపించాడు. నిన్న వరంగల్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పూరి జగన్నాథ్ మాట్లాడాడు. అందరి గురించి మాట్లాడిన పూరి..ఛార్మీ గురించి ప్రస్థావించాడు. ఛార్మి నా స్ట్రెంగ్త్. సెట్‌లో నాకు ఏ టెన్షన్ రాకుండా అన్నీ చూసుకుంటుంది అని ఛార్మీ గురించి చెప్పేశాడు.
ఇక రొమాంటిక్ సినిమా గురించి చెబుతూ.. అనిల్ బాగా ప్రెజెంట్ చేశాడు. నేను నాలుగైదు సార్లు చూశా. ఎక్కడా బోర్ కొట్టదు,నాకు చాలా బాగా నచ్చింది. సెకండాఫ్ బాగుటుంది. క్లైమాక్స్ అయితే సూపర్. ఆకాష్, కేతిక, రమ్య ఇరగొట్టేశారు. చాలా ట్రెండీగా ఉండే సినిమా ఇది. మీకు మంచి ఎంటర్ టైన్ మెంట్ కావాలంటే ఈ సినిమా చూడండి. నేనది ప్రామిస్ చేస్తున్నాను అని అన్నాడు.