• October 23, 2021

Akash Puri: నేను దేనికీ పనికి రాను!.. స్టేజ్ మీద ఊగిపోయిన ఆకాష్ పూరి

Akash Puri: నేను దేనికీ పనికి రాను!.. స్టేజ్ మీద ఊగిపోయిన ఆకాష్ పూరి

    Akash Puri ఆకాష్ పూరి హీరోగా ఎదిగేందుకు చాలా ప్రయత్నిస్తున్నాడు. హీరోగా చేసిన చిత్రాలు దారుణంగా బెడిసి కొడుతున్నాయి. చివరగా వచ్చిన మెహబూబ సినిమా డిజాస్టర్‌గా మారింది. లేత కుర్రాడిలా ఉన్నాడు. ఇప్పుడే ఈ యాక్షన్, మాస్ ఇమేజ్ ఎందుకు అంటూ నానా రకాలుగా కామెంట్లు చేశారు. అసలు హీరోగా పనికొస్తాడా? అని కూడా కొందరు అనుకున్నారట. అలాంటి కామెంట్లు చేసే వాడికి ఆకాష్ పూరి అదిరిపోయే కామెంట్లు చేశాడు.

    తన తండ్రి గురించి తప్పుగా మాట్లాడితే తల పగలగొట్టేయాలని అనిపిస్తుందని అన్నాడు. ఇక తన తండ్రిని తల ఎత్తుకుని, కాలర్ ఎగిరేసేలా చేస్తాను.. హిట్ కొట్టి చూపిస్తాను.. నేను పూరి కొడుకుగా పుట్టడం నా అదృష్ణం.. ఆకాష్ నా కొడుకు అని చెప్పుకునేలా చేస్తాను.. అది ఇప్పుడు ఎప్పుడా? అని చెప్పలేను కానీ కచ్చితంగా చేస్తాను అని అన్నాడు.

    ఇక టెంపర్, నేనింతే సినిమా డైలాగ్‌లను స్టేజ్ మీద తన స్టైల్లో చెప్పేశాడు. నేను హిట్ కొట్టాలి.. మా నాన్న కాలర్ ఎగిరేయాలి.. నేను హిట్ కొట్టాలి.. మా నాన్న కాలర్ ఎగిరేయాలి అని పోసానీ స్టైల్లో చెప్పాడు. ఈ సినిమా హిట్ అయినా మళ్లీ ఇంకో సినిమా చేస్తాను.. ఫ్లాప్ అయినా ఇంకో సినిమా చేస్తాను.. నాకు ఇదొక్కటే తెలుసు.. ఇంకేమీ రాదు.. ఇంకా దేనీకి కూడా నేను పనికి రాను అంటూ నేనింతే సినిమాలో రవితేజ స్టైల్లో డైలాగ్స్ చెప్పేశాడు.

    Leave a Reply