- February 17, 2022
Karthika Deepam నేటి ఎపిసోడ్.. దీప అనుమానం.. నమ్మని కార్తీక్

కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ అంటే ఫిబ్రవరి 17న గురువారం నాడు ప్రసారం కానున్న Karthika Deepam Episode 1278 ధారావాహికలో మోనిత మీద దీప అనుమానం వ్యక్తం చేస్తుంది. మరో వైపు మోనిత వేసిన నాటకాన్ని పసిగట్టే ప్రయత్నం దీప చేస్తుంది. కానీ కార్తీక్ మాత్రం వాటిని నమ్మేందుకు సిద్దంగా ఉండడు. మొత్తానికి కార్తీక దీపం నేటి ఎపిసోడ్ అలా ముందుకు సాగింది.
మోనిత హాస్పిటల్ బోర్డును వారణాసి చించి అవతలపారేస్తాడు. దీంతో మోనిత వచ్చి చూస్తుంది. అసలు విషయం అర్థమవుతుంది. కానీ తన బాబాయ్, బస్తీ వాళ్ల ముందు మంచిదానిలా మోనిత నటిస్తుంది. బోర్డు పెట్టినందుకు కోపం వచ్చిందేమో.. లక్ష్మణ్ ఎందుకు కోపం.. మన దీపే కదా? పైన పెట్టేయ్.. దీప ఏదో చేసిందని మనం కోప్పడతామా?.. మీరు టెన్షన్ పడకండి.. మీరు బాగున్నారు నాకు అది చాలు అని మోనిత అంటుంది. ఆ బోర్డ్ మళ్లీ ఎందుకు పెడుతున్నావ్ దీపమ్మ వద్దని చెప్పింది కదా? బస్తీలో ఒకడు అంటాడు. వాడిని మోనిత లాగి పెట్టి కొడుతుంది. మధ్యలో నువ్వు ఎవడ్రా ఇది మోనిత సామ్రాజ్యం.. అని మోనిత అంటుంది.
కార్తీక్ ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. తాతయ్యను తీసుకొద్దాం.. అని హిమ, శౌర్య అంటారు. ఆయన మనసంతా ఇక్కడే ఉంటుంది.. అని సౌందర్య అంటుంది. మనమంతా అంత్యాక్షరి, డ్యాన్సులు చేసి వీడియోలు పంపుదామా?. అని హిమ అంటుంది. మీకు కావాలంటే అడగండి.. మధ్యలో మా నాన్న పేరు ఎందుకు అని ఆదిత్య అంటాడు.. రౌడీ నీకు హెల్త్ బాగా లేదు కదా? ఇప్పుడు ఇవన్నీ వద్దు అని అంటారు… శౌర్యకు బాగా లేదు కానీ బాబాయ్ చేయోచ్చు కదా? అని హిమ అంటుంది. కావాలంటే ఓ సెల్ఫీ తీస్తాను..అని ఆదిత్య అంటాడు.
కార్తీక్‌ను మళ్లీ డాక్టర్ అసోసియేషన్‌లోకి తీసుకునేందుకు మోనిత ఎందుకు సాయం చేసింది? అనే విషయంలో భారతి ఆరా తీస్తుంటుంది. తన భర్త రవితో ఇదే విషయాన్ని చర్చిస్తుంది భారతి. ఏదో తేడా కొడుతోందంటూ భారతి అనుమానం వ్యక్తం చేస్తుంది. మోనిత ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరూ ఊహించలేరు.. నాకు ఏదో తేడా కొడుతోంది.. తెలుసుకునే ప్రయత్నం చేస్తాను.. అని భారతి అంటుంది.
ఇక బోర్డ్ పీకేయడంతో కోపంతో దీప ఇంటికి వస్తుంది మోనిత. అక్కడ బాబును ఎత్తుకున్న కార్తీక్ చూస్తుంది. మన బాబును ఎప్పుడైనా ఇలా ఎత్తుకున్నావా? దీపు గాడిని మాత్రం ఎత్తుకున్నావ్ అని అంటుంది. దీపుగాడు కాదని చెప్పబోతోంటే శ్రావ్య అడ్డుకుంటుంది. తనకు వివరాలు చెప్పాల్సిన అవసరం లేదని శ్రావ్య అంటుంది. ఎందుకొచ్చావ్ అని కార్తీక్ అడుగుతాడు. వచ్చే హక్కు నాకుందని మోనిత అంటుంది.
ఎందుకు వచ్చిందో నాకు తెలుసు..నేను చెబుతాను డాక్టర్ బాబు అని దీప అంటుంది. వచ్చేలా చేశావ్.. కదా? అని మోనిత అంటుంది. ఆ బోర్డుని పీకించేశాను.. అదీ తన కడుపుమంట.. అని దీప అంటుంది. నా కడుపుమంటలు చాలా ఉన్నాయ్.. అది నా హాస్పిటల్.. నా బోర్డు నా ఇష్టం.. అని మోనిత అంటుంది. నా పేరు పెట్టడానికి నీకు హక్కు ఎవరిచ్చారు.. మొండిఘట్టం మోనిత అని పెట్టుకో.. నా పేరు, డాక్టర్ బాబు పేరు ఎందుకు పెట్టుకున్నావ్.. బస్తీ వాళ్లను ఎందుకు బాధలుపెడతున్నావ్.. అని దీప ప్రశ్నిస్తుంది. చాలా ఇన్ఫర్మేషన్ లాగేశావ్.. అని మోనిత అంటే.. నేను లేనప్పుడు నీ ఆటలు సాగాయ్ కానీ ఇప్పుడు కాదు అని దీప అంటుంది.
బస్తీ వాళ్లను నా వైపుకు తిప్పుకుంటాను.. వాళ్లు నా ఫ్యాన్స్.. నువ్వే అన్నావ్ కదా? నీ మాట నీకే చెబుతున్నా.. అని దీప అంటుంది. మాటలు బాగానే నేర్చావ్ దీపక్క.. కార్తీక్ సింపుల్‌గా అయ్యేదాన్ని కాంప్లికేట్ చేస్తున్నావ్.. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకుంటున్నావ్ అని మోనిత అంటుంది. ఇంత వరకు నువ్ ఎన్ని చేసినా సహనంతో ఓపిక పట్టాం.. నేనూ నీలా ఆలోచిస్తే పదిరెట్లు ఆలోచనలు చేయగలను.. దీప అంటే ఏంటో అతి త్వరలోనే చూపిస్తాను.. అని మోనితకు వార్నింగ్ ఇస్తుంది.
ఇక్కడకు వచ్చాక కష్టాలన్నీ మరిచిపోయాం.. ఇక్కడే బాగుంది.. బయటకు వెళ్లి ఐస్ క్రీం తిందామా?.. అని హిమ, శౌర్యలు అనుకుంటారు. బాబాయ్‌ని వెళ్లి అడుగుదామని పిల్లలు వెళ్తారు. బాబాయ్ అని పిలుపు విని చాలా రోజులైంది.. ఇప్పుడు చాలా వర్క్ ఉందిరా.. తరువాత వెళ్దామా?.. మిమ్మల్ని రోజంతా తిప్పాలని ఉంది.. అడిగినవన్నీ కొనించాలని ఉంది.. అని ఆదిత్య అంటాడు. వారణాసిని పిలుస్తాం.. తింటాం.. అటునుంచి అటే బస్తీకి వెళ్తాం.. అని పిల్లలు అంటారు. బస్తీకి వద్దు.. నేనే సాయంత్రం తీసుకెళ్తాను అని ఆదిత్య చెబుతాడు.
మీకు డాక్టర్ లైసెన్స్ రావడం వెనక ఏదో కుట్ర ఉందనిపిస్తోంది.. అని దీప అనుమానం వ్యక్తం చేస్తుంది. నెగెటివ్‌గా ఎందుకు ఆలోచించడం.. వాళ్ల బాబాయ్ కోసం చేసిందేమో.. అని కార్తీక్ అమాయకంగా నమ్మేస్తాడు. మోనిత అంటే మోసం, కుట్ర.. చెప్పేది ఒకటంటే.. చేసేది ఇంకొకటి.. నమ్మకండి.. అని దీప అంటుంది. ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు అని కార్తీక్ అంటాడు.. అసలు మీరు ఒక విషయమే మరిచిపోయారు.. రావడానికి కారణం మోనిత అంటున్నారు.. లైసెన్స్ పోవడానికి కూడా మోనిత ఓ కారణమేమో.. అని దీప అసలు విషయాన్ని పసిగట్టేస్తుంది.
ఏంటి దీపి.. ఇంత దారుణంగా ఆలోచిస్తున్నావ్..అని కార్తీక్ అంటాడు. ఇది నా ఆలోచన కాదు కేవలం అనుమానం.. ఇందులో నిజం ఉండొచ్చు అబద్దం ఉండొచ్చు.. అని దీప అంటుంది. మనకి మోనితకి ఆలోచనల్లో తేడా ఉండాలి కదా? మనం అలా ఆలోచించడం ఎందుకు.. అని కార్తీక్ అంటాడు. తనలాంటి వాళ్లను ఎదుర్కొవాలంటే.. తనలానే ఆలోచించాలి.. అని దీప చెబుతుంది. అలా ఎపిసోడ్ ముగుస్తుంది.