- February 16, 2022
Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. వసుకి గులాబీ ఇచ్చిన రిషి.. మనసులో మాట అదేనట
గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే ఫిబ్రవరి 16న బుధవారం నాటి Guppedantha Manasu Episode 375 ధారావాహికలో గౌతమ్‌ని బక్రా చేసేశాడు రిషి. వసుకి రోజా పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేద్దామని అనుకున్నాడు. కానీ రిషి మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తాడు. చివరకు వసుకి రిషి గులాబీ పువ్వు ఇచ్చేస్తాడు. ఇక మరో వైపు జగతి, మహేంద్రలను చూసి గౌతమ్ షాక్ అవుతాడు.
షార్ట్ ఫిల్మ్‌లో గౌతమ్ యాక్ట్ చేయడంపై రిషి అభ్యంతరం వ్యక్తం చేస్తాడు. జగతితో ఇదే విషయాన్ని చెబుతాడు. నా ఫ్రెండ్ అయినంత మాత్రాన గౌతమ్ నటించడం నాకు ఇష్టం లేదని అంటాడు రిషి. శిరీష్ సాయం తీసుకున్నాం కదా? అని జగతి మనసులో అనుకుంటుంది. అది కూడా రిషి కనిపెట్టేస్తాడు. అప్పుడు సాయం తీసుకున్నాం కానీ గౌతమ్ మాత్రం షార్ట్ ఫిల్మ్‌లో నటించడం వద్దని రిషి అంటాడు.
ఇక వసుధార మిషన్ ఎడ్యుకేషన్ మీటింగ్ కోసం హాలును రెడీ చేస్తుంటుంది. వసు ఒంటరిగా ఉందని ప్రపోజ్ చేద్దామని రోజా పువ్వుతో రెడీ అవుతాడు గౌతమ్. కానీ ఇంతలో రిషి వచ్చి డిస్టర్బ్ చేసేస్తాడు. గౌతమ్‌ని బయటకు పంపించేస్తాడు రిషి. ఆ తరువాత రిషి, వసులు ఇద్దరూ కాస్త రొమాంటిక్ మూడ్‌లోకి వెళ్లిపోతారు. వసు జుట్టు.. రిషి షర్ట్ బటన్‌కు చిక్కుకుంటుంది.
గౌతమ్ గురించి రిషి చెప్పిన మాటలను మహేంద్రకు జగతి చెబుతుంది. షార్ట్ ఫిల్మ్‌లో నటించొద్దని చెప్పాడు.. ఈ విషయాన్ని ఎలా చెప్పాలంటూ జగతి ఆలోచిస్తుంటుంది. ఎండీ చెప్పింది చేసేయడమే అంటూ మహేంద్ర అంటాడు. మరీ ఎక్కువగా ఆలోచించొద్దంటూ మహేంద్ర అంటాడు. ఇక కాఫీ తాగుతాను అని మహేంద్ర మారం చేస్తుంటాడు. జగతి వద్దని అంటుంది. ఈ ఇద్దరిని అలా చూసి గౌతమ్ షాక్ అవుతాడు.
షార్ట్ ఫిల్మ్ అవేర్‌నెస్ గురించి రిషికి వసు వివరిస్తుంది. అదంతా విని మెచ్చుకుంటాడు. గౌతమ్ ఇవ్వాలనుకున్నా రోజా పువ్వుని రిషి ఇస్తాడు. సెల్ఫీ దిగుదామని వసు అనుకుంటుంది. కానీ వద్దని రిషి వారిస్తాడు. ఇది ఎప్పటికీ దాచుకుంటాను అని వసు లోలోపల అనుకుంటుంది. ఆ విషయాన్ని రిషి కనిపెట్టేస్తాడు. నువ్ నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలుసు అని రిషి అంటాడు.
అలా ఎపిసోడ్ మొత్తానికి ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్‌లో గౌతమ్ మాటలకు రిషి బాధపడతాడు. అంకుల్, జగతి మేడం ఎందుకంతా క్లోజ్‌గా ఉంటారు.. ఏదో స్కూల్ ఫ్రెండ్స్‌లా ఉంటారు అని రిషి ముందే గౌతమ్ అంటాడు. దీంతో రిషి బాధపడతాడు. ఈ విషయంలో వసు కూడా రిషినే తప్పుబడుతుంది. జగతి మేడం ఎంత కాదన్నా కూడా అని వసు అనగానే రిషి మొహం మాడిపోతుంది.
- Tags
- Guppedantha Manasu Daily serial Episode
- Guppedantha Manasu Episode 375
- Guppedantha Manasu New Episode
- Guppedantha Manasu serial today Episode 375
- guppedantha manasu serial yesterday episode
- Guppedantha Manasu Today Episode
- Guppedantha Manasu today Episode 375
- గుప్పెడంత మనసు
- గుప్పెడంత మనసు ఈ రోజు సీరియల్
- గుప్పెడంత మనసు ఈరోజు ఎపిసోడ్
- గుప్పెడంత మనసు ఈరోజు సీరియల్
- గుప్పెడంత మనసు టుడే ఎపిసోడ్
- గుప్పెడంత మనసు డైలీ సీరియల్
- గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్
- గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ కావాలి
- గుప్పెడంత మనసు సీరియల్ టుడే ఎపిసోడ్
- జగతి
- మహేంద్ర
- రిషి
- వసు
- వసుధార