- February 17, 2022
Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. గౌతమ్ పెట్టిన మంట.. వసు దెబ్బకు రిషి సైలెంట్

గుప్పెడంత మనసు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ అంటే ఫిబ్రవరి 17 గురువారం ప్రసారం కానున్న Guppedantha Manasu Episode 376 ధారావాహికలో రిషి అసహనం వ్యక్తం చేస్తాడు. గౌతమ్ మాట్లాడిన విషయాలు, అడిగిన ప్రశ్నలకు రిషి హర్ట్ అవుతాడు. ఈ విషయం మీద వసుతో రిషి మాట్లాడతాడు. వసు మాటలకు రిషి దెబ్బకు నోరు మూస్తాడు. అలా గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ ముందుకు సాగింది
జగతి,మహేంద్రలు అంత క్లోజ్‌గా మాట్లాడుకోవడం చూసిన గౌతమ్ ఆశ్చర్యపోతాడు. అంకుల్, మేడం మధ్య ఏముంది.. క్లాస్ మేట్స్ కాదు.. కొలిగ్స్ కాదు.. మరీ అంత క్లోజ్‌గా ఉన్నారేంటి.. రిషి గాడిని అడిగితే తిడతాడు.. అయినా మనం ఆగుతామా? మనం రిషి వసు గురించి ఆలోచించాలి.. రిషిగాడు రోజుకురోజుకీ విలన్‌లా మారిపోతోన్నాడు.. ఏం చేయాలో అర్థం కావడం లేదు.. ఇదేంటి వసుధార చేతిలో రోజ్ ఉంది..అమ్మ రిషిగా.. నువ్ ఇచ్చావా? మిత్రద్రోహి నీ కడుపులో ఇంతుందా? అని వసు, రిషిలను చూసి గౌతమ్ ఆశ్చర్యపోతాడు.
ఈ రోజ్.. అని గౌతమ్ ఏదో అడగబోతాడు. ఏంట్రా నీ బాధ.. అని రిషి అంటాడు. ఆ రోజ్ ఎక్కడిది అని గౌతమ్ అడుగుతాడు.. మామిడిపళ్లు ఎక్కడ కాస్తాయ్ మామిడి చెట్టుకు కాస్తాయ్.. గులాబీ పూలు ఎక్కడ పూస్తావ్.. గులాబీ మొక్కకి పూస్తాయ్..ఇవేం ప్రశ్నలురా.. నీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమా? ఇంటికి వెళ్తావా? అని గౌతమ్‌ను డైవర్ట్ చేస్తాడు రిషి. ఏం నటిస్తున్నావ్ రా.. ద్రోహి.. అడగబోతోంటే.. అడగనివ్వడం లేదు.. ఈ రోజ్ గురించి అడిగితే నన్ను ఫూల్‌ని చేస్తాడు కోప్పడతాడు.. అని వసుతో మాటలు కలుపుతాడు గౌతమ్. క్లైమేట్ బాగుంది.. అని గౌతమ్ అంటే.. వసు ఏదో చెప్పబోతోంది. ప్లీజ్ చర్చ పెట్టకండి.. అని రిషి అంటాడు.
అయినా నిన్ను మేడంని కలవమని చెప్పాను కదా? అని రిషి అంటాడు. మేడంని కలవడానికే వెళ్లాను.. అక్కడ మేడం, అంకుల్ మాట్లాడుతున్నారు.. డిస్టర్బ్ చేయడం ఎందుకని వెళ్లలేదు.. అవును వాళ్లిద్దరూ ఏంట్రా.. చాలా క్లోజ్ ఫ్రెండ్స్‌లా ఉంటున్నారు.. అని గౌతమ్ అడగటంతో రిషి ఫీల్ అవుతాడు. షార్ట్ ఫిల్మ్స్‌కి సంబంధించి.. ఏదైనా మాట్లాడుతున్నారేమో అని వసు అంటే.. అయినా అంతకంటే మించి ఉన్నారు అని గౌతమ్ అంటాడు. అలా మొత్తానికి రిషి మాత్రం ఫీల్ అవుతాడు.
విన్నావ్ కదా? గౌతమ్ ఎలా మాట్లాడుతున్నాడో.. పర్సనల్ లైఫ్ గురించి ప్రశ్నలు అడుగుతుంటే ఎలా అనిపించిందో.. మీ మేడంకు నువ్వైనా చెప్పొచ్చు కదా?. అని రిషి అంటాడు. దీంతో వసు క్లాస్ పీకుతుంది. ఏం చెప్పమంటారు.. వాళ్లది పవిత్ర బంధం.. అది లేదని చెప్పాలా?. మీకు మాత్రమే బాధ ఉందా? మేడం గారికి బాధ లేదా?.. వంద రెట్లు ఎక్కువగా క్షోభ పడుతుంది.. స్త్రీని అలా ఇలా అని గొప్పగా ఉపన్యాసాలు.. స్త్రీ ఒంటరిగా ఉందంటే ఎన్నో ప్రశ్నలు ఎదుర్కొవాల్సి ఉంటుంది.. గౌతమ్ లాంటి వాళ్ల వంద మంది ఎదురవుతారు.. ఏమని చెప్పమంటారు.. అని వసు వరుసగా దంచి కొడుతుంది. దీంతో రిషి నోర్మూస్తాడు.
మీరు ఒక తల్లిని మాత్రమే దూరం చేసుకున్నారు. కానీ మేడం మాత్రం.. భర్తను, కొడుకు, అత్తారింటిని దూరం చేసుకుంది.. సమాజం అడిగే ప్రశ్నలకు ఎదుర్కొనేందుకు చాలా ధైర్యం కావాలి.. నేనేం తక్కువ కోల్పోలేదు కదా? అందరూ పేరెంట్స్‌తో తిరుగుతుంటే..నేను అసూయ పడేవాడిని.. మీరు ద్వేషించినా ద్వేషించకపోయినా.. వాళ్లు భార్య భర్తలు కాకుండా పోరు..
దాచడానికి ఇందులో ఏముంది.. అగ్నిసాక్షిగా ఒక్కటైన బంధం.. మహేంద్ర సర్ మీ నాన్న.. మహేంద్ర సర్ భార్య జగతి అయినప్పుడు.. మీకు.. అని గ్యాప్ ఇస్తుంది. దీంతో రిషి కోపంగా చూస్తాడు. ఆ బంధం అబద్దమైపోదు కదా? ఇది సున్నితమైన అంశం.. మనం చర్చించకుండా ఉంటేనే బాగుంటుంది.. ఒక్క మాట సర్.. వాళ్ల బంధం గురించి మనం మాట్లాడుకోవడం ఏంటి.. అది వాళ్ల పర్సనల్ సర్.. ఈ చర్చ మన మధ్య రాదని అనుకుంటున్నాను.. అని రిషి అంటుంది. ఆ తరువాత ఇద్దరూ ప్రాజెక్ట్ పనుల్లో భాగంగా సైట్ విజిట్‌కు వెళ్తారు. అక్కడి నుంచి తిరిగి వచ్చే సమయంలో రిషిపై బురద పడుతుంది. రిషి కోటును తీసి వసు క్లీన్ చేస్తుంది. అలా ఎపిసోడ్ మొత్తానికి ముగుస్తుంది.